Bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు ఐదవ వారం ప్రారంభమైంది. ఇక సోమవారం అంటే నామినేషన్స్ ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. మిగిలిన వారాలతో పోలిస్తే ఈ వారం హౌస్ అంతా హీట్ హీట్‌గా ఉంటుంది. అది కూడా ఈ వారం బిగ్‌బాస్ పెట్టిన మెలికకి దుమ్ము లేచిపోవాలి. అంతలా ఊహించని ట్విస్ట్ పెట్టాడు. సాలిడ్‌గా ఇరికించేశాడు. కానీ వీళ్లు మహానుభావులు. బిగ్‌బాస్ ఏదో అనుకుంటే వీళ్లు మరొకటి చేసేసి హీట్ హీట్‌గా సాగాల్సిన నామినేషన్స్‌ను చల్లగా మార్చేశారు. అంతకు ముందు సీజన్స్‌లో నామినేషన్స్ అంటే అరుపులు, కేకలు, రచ్చ రంబోలా.
కానీ ఈ సీజన్‌లో అరుపులు లేవు.. కేకలు లేవు. అంతా ఏదో హిమాలయాల్లో ఉన్నట్టు చల్లగా మాట్లాడుకుంటున్నారు. అసలు హీటెడ్ ఆర్గ్యుమెంటే లేదు. బిగ్‌బాస్ ఇద్దరు ఇద్దరు చొప్పున పిలిచి వారి ఒక్కో చేతికి సంకెళ్లు వేసి.. గతంలో మాదిరిగా తాము నామినేషన్స్ నుంచి ఉండకుండా ఉండేదుకు తగిన కారణాలతో ఆర్గ్యూ చేసుకోమని చెప్పారు. కాంబినేషన్స్ కూడా డెడ్లీ కాంబినేషన్స్. ఈసారి మెరీనా, రోహిత్‌లను విడదీశాడు. వారిద్దరి చేతులకు సంకెళ్లేసి తేల్చుకోమన్నాడు. ఏదో చేస్తారనుకుంటే.. ఏమీ లేదు. సింపుల్‌గా మెరీనా మ్యాటర్ తేల్చేసింది.
ఆ తరువాత సుదీప, వాసంతిలకు బేడీలు వేశాడు. వీళ్లిద్దరూ అంతే.. సింపుల్‌గా మ్యాటర్ తేల్చేశారు. ఇక అర్జున్, శ్రీ సత్య. వీళ్లిద్దరూ అంతే.. లాస్ట్ వీక్ నీకు ఎంత హెల్ప్ చేశానో నీకు తెలుసు అని గోముగా శ్రీసత్యను అర్జున్ అడిగితే.. నువ్వు ఊరికే ఏం చేయలేదు. సేవలు చేయించుకున్నావు ఇచ్చావు అంటుంది. సరే వీరిద్దరిలో ఎవరు సేఫ్ అనే తెలియలేదు. ఇక ఇవాళ రిలీజ్ చేసిన తొలి ప్రోమోలో ఫైనల్‌గా బిగ్‌బాస్ హౌస్ బద్ద శత్రువులు.. ఇనయ, శ్రీహాన్‌లకు బేడీలు వేశారు. ఇక వీళ్లిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్‌కు హౌస్ దద్దరిల్లిపోద్దని భావించిన ఆడియన్స్‌కు నిరాశే మిగిలింది. ఇద్దరూ హీటెడ్ ఆర్గ్యుమెంట్ జోలికి వెళ్లకుండా మిగిలిన వాళ్ల మాదిరిగా కాకుండా ఏదో తేల్చేశారు. ఇంత చప్పటి నామినేషన్స్ బిగ్‌బాస్ చరిత్రలోనే లేవనుకుంటా. మొత్తానికి అంతా కలిసి నామినేషన్స్‌కే అర్ధం మార్చేశారు.