Bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు ఈ వారం కంటెస్టెంట్స్ చాలా మంది వారి ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడిన విషయం తెలిసిందే. చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ కంటెస్టెంట్స్‌కి కావల్సినంత బూస్ట్ ఇచ్చారు.శ్రీహాన్‌కు ఇంటి నుంచి మటన్ బిర్యానీ వచ్చింది. గీతూకి తన తండ్రి నుంచి ఆడియో కాల్ వచ్చింది.రాజ్‌కి వాళ్ల అమ్మగారి నుంచి కాల్.. అర్జున్‌కి తన తండ్రి నుంచి వీడియో మెసేజ్.. వాసంతికి అక్క కూతురి ఫోటో, కీర్తికి తన స్నేహితుడు మానస్ నుంచి ఆడియో మెసేజ్ వచ్చింది. సూర్య తన తల్లి నుంచి లేఖను అందుకుని మురిసిపోయాడు.
రోహిత్, మెరీనా మినహా మిగిలిన వారందరికీ ఏదో ఒకటి అయితే వచ్చింది. ఇక ఆదిరెడ్డికి తన భార్య నుంచి ఫోన్ కాల్ వచ్చింది.కవిత చాలా ఇంటెలిజెంట్‌గా తన భర్త ఆదిరెడ్డికి ఇవ్వాల్సిన హింట్స్ ఇచ్చేసింది. తను మూడు నెలల పాటు భర్తకు దూరంగా ఉన్నందుకు గానూ గిఫ్ట్‌గా విన్నర్ అయి తిరిగి రావాలని కోరింది. దీనికి ఆదిరెడ్డి కూడా తప్పకుండా విన్ అవుతానని చెప్పాడు.నీ వైపు తప్పులేనప్పుడు.. అవతల వ్యక్తి ఎవరైనా సరే ఆర్గ్యుమెంట్ చేయి.. అస్సలు వదలొద్దు’ అని చెప్పింది.దీంతో తన ఆర్గ్యుమెంట్స్ జనానికి నచ్చుతున్నాయని ఆదిరెడ్డి గెస్ చేస్తాడనే అంతా భావించారు. ఇక తను దాని గురించి ఆలోచించాడో లేదో తెలియాల్సి ఉంది.
ఇక కవితపై వాసంతి, మెరీనా, కీర్తిలు అవాకులు చెవాకులు పేలారు. ఇష్టానుసారంగా మాట్లాడారు.కవితలో వాసంతికి ఒక టైప్ ఆఫ్ యాటిట్యూట్ కనిపించిందట. తప్పు లేకుండా తగ్గొద్దు అంటోందేంటి? అని వాసంతి.. ఆ మాట ఆమెకు చాలా తప్పుగా అనిపించిందట.ఆదిరెడ్డి డిజర్వ్‌డ్ అంతా బయటకు వెళ్లిపోతున్నారూ అంట. ఇదే పాయింట్‌పై ఇక నుంచి సీజన్ పూర్తయ్యే వరకూ నామినేట్ చేస్తుందట. ఈమె మహా అయితే రెండు వారాలకు మించి ఉండే అవకాశమే కనిపించట్లేదు. ఈమె సీజన్ మొత్తం నామినేట్ చేస్తుందట. బయట పరిస్థితులు తెస్తే అమ్మడు ఇలా మాట్లాడదేమో.. ఇంకా ఆదిరెడ్డి తప్పు లేకుండా ఇచ్చి పడేస్తా అన్నాడు కదా.. దానిలో కూడా తప్పులెంచుతోంది వాసంతి. ఇక దీనికి కీర్తి మెరీనాలు ఇచ్చి పడేస్తే ఊరుకోవడానికి ఎవరూ లేరు అని వంత పాడటం. అమ్మో.. ప్రశాంతంగా గంప కింద కోళ్లు మాదిరిగా ఆట ఆడకుండా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటున్నారు. దీనిని కూడా కాపాడుకోలేక తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నారు.