Siima Awards: చిత్ర పరిశ్రమలో అందించే పురస్కారాలలో సైమా అవార్డ్స్ ఒకటి. ప్రతి ఏడాది అన్ని కేటగిరీలకు సైమా అవార్డ్స్ ప్రధానోత్సవం చేస్తుంటారు. అయితే ప్రతి ఏడాది ఈ కార్యక్రమం హైదరాబాద్లో నిర్వహించగా ఈసారి ఈ వేడుకను బెంగళూరులోని గార్డెన్ సిటీలో ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు. రెండు రోజులపాటు జరిగే సైమా పురస్కారాలలో భాగంగా తెలుగు స్టార్స్ పెద్ద ఎత్తున సందడి చేయబోతున్నారు.
ఈ వేడుకలో భాగంగా దక్షిణాది సినీ ఇండస్ట్రీకి చెందిన అతిరథ మహారథి అందరూ ఒకే చోట చేరి సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.ఈ అవార్డ్స్ కోసం తెలుగులో పలు సినిమాలు వివిధ కేటగిరీలలో పెద్ద ఎత్తున పోటీపడినట్లు తెలుస్తోంది.
ఇక ఈ అవార్డు కార్యక్రమాలలో భాగంగా వివిధ భాగాలలో పుష్ప ది రైజ్ సినిమా నుంచి 12 నామినేషన్లు కాగా బాలకృష్ణ అఖండ సినిమా నుంచి 10 నామినేషన్లు, ఉప్పెన, జాతి రత్నాలు సినిమాలు ఎనిమిది నామినేషన్స్ సాధించాయి. ఈ సైమా అవార్డులను పబ్లిక్ పోలింగ్, సీనియర్ ఆర్టిస్ట్, ప్రొఫెషనల్ తో కూడిన స్పెషల్ జ్యూరీ విజేతలను ఎంపిక చేయనుంది.ఇకపోతే ఈ అవార్డు వేడుకలలో భాగంగా ఎక్కువ భాగం పుష్ప సినిమాకు అవార్డులు వచ్చినట్టు తెలుస్తుంది.
Siima Awards: ఉత్తమ నటుడిగా పుష్పరాజ్..
పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఈ క్రమంలోని వివిధ కేటగిరీలో భాగంగా పుష్ప సినిమాకు అధిక అవార్డులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక బెస్ట్ యాక్టర్ అవార్డు సైతం అల్లు అర్జున్ అందుకోనున్నారట. ఇక ఈ వేడుకలలో పాల్గొనడం కోసం ఇప్పటికే అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ బెంగళూరుకు చేరుకున్నారని, ఈ స్టార్స్ ఎయిర్పోర్టులో సందడి చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.