Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 12వ ఎపిసోడ్ లో రెండో కెప్టెన్ ఎవరో తెలియనుంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించి మొదటి ప్రోమోలో.. హౌస్ లోకి “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” హీరో సుధీర్ బాబు హీరోయిన్ కృతి శెట్టి వచ్చినట్లు చూపించారు. అయితే సెకండ్ ప్రోమోలో ఇంటి సభ్యులు కెప్టెన్ ఎన్నిక విషయంలో ఎవరికి వారు తమ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉన్నారు. ఓటింగ్ ప్రకారం రెండో కెప్టెన్ ఎన్నిక ఇంటి సభ్యులకే బిగ్ బాస్ ఇవ్వటంతో.. ఎవరికివారు తమ మద్దతు ఎవరో తెలియజేస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే ప్రోమో స్టార్టింగ్ లో మొదటి కెప్టెన్ బాలాదిత్యా.. బాత్రూం క్లీనింగ్ సెక్షన్ రేవంత్ కి ఇంకా ఆదిరెడ్డికి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను పని చెబితే చేస్తాను. కానీ ఒకే పనికి రిపీట్ అవుతూనే ఉన్నారు. ఆ తర్వాత బాత్రూంలో క్లీన్ చేస్తూ నాకు కెప్టెన్సీ టాస్క్ రాదా..? అప్పుడు ఒక్కొక్కరి సంగతి చెబుతా. ఎవరికి ఏ పని అయితే నచ్చదో… ఆ పనే చేపిస్తా అని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అనంతరం కెప్టెన్సీ కావటానికి ప్రచారం చేసుకుంటున్నా రాజ్ పై చంటి సెటైర్లు వేస్తున్నట్లు చూపించారు. ఇక తర్వాత సుల్తానా తనని ఎవరు గుర్తించడం లేదని చంటి, వాసంతి వద్ద ఏడుస్తోంది. టాస్కులన్నీ బాగాడిన గాని.. లాభం లేకుండా పోయింది అన్నట్టు డైలాగులు వేసింది. ఇక ప్రోమో చివరిలో హౌస్ లో అందరూ గేమ్ ఆడుతున్నారు. ఎవ్వరు అమాయకులు కాదు, ఎవరు తెలియనోళ్లు కాదు అంటూ ఆది రెడ్డి.. గీతు వద్ద డైలాగులు వేయడం జరిగింది.