హీరోగా సౌత్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటుడు సిద్దార్ధ్. సిద్దార్ధ్ ప్రస్తుతం తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నాడు. తెలుగు సినిమాలకి పూర్తిగా దూరం అయ్యాడు. అడపాదడపా అప్పుడప్పుడు డబ్బింగ్ సినిమాలతో పలకరిస్తున్నారు. సిద్దార్ధ్ చివరిగా మహాసముద్రం సినిమాలో తెలుగులో కనిపించాడు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక ఆ సినిమాలో సిద్దార్ధ్ కి జోడీగా అదితీరావ్ హైదరీ నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య బంధం చిగురించినట్లు కోలీవుడ్ లో పుకార్లు షికారు చేశాయి. అయితే ఎవరి కెరియర్ లో వారు బిజీగా ఉండటంతో అవి రూమర్స్ గానే ఇన్ని రోజులు కనిపించాయి. ప్రస్తుతం అదితీరావ్ తమిళ్ తో పాటుగా హిందీ సినిమాలు కూడా చేస్తుంది.
అలాగే వెబ్ సిరీస్ లలో సందడి చేస్తుంది. ఇక సిద్ధార్ద్, అదితీరావ్ హైదరీ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారనే మాటలకి ఇప్పుడు బలం చేకూరినట్లు అయ్యింది. అదితీరావ్ హైదరీ పుట్టినరోజు సందర్భంగా సిద్దార్ధ్ ఆమెకి ట్విట్టర్ లో విష్ చేసాడు. అయితే ఇదేదో క్యాజువల్ గా విష్ చేసి ఉంటే వారిమధ్య ఎలాంటి బంధం లేదనిఅనుకోవచ్చు. కానీ సిద్ధార్ధ్ ట్విట్టర్ లో వారిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫోటోని షేర్ చేయడంతో పాటుగా నా హృదయ రాకుమారి అదితీరావ్ హైదరీ హ్యాపీ బర్త్ డే. నీ కలలని నిజం చేసుకోవాలని కోరుకుంటున్నాను.
నా జీవితంలో ఇది బెస్ట్ ట్రిప్ అంటూ రాసుకొచ్చాడు. దీనిని బట్టి వీరిద్దరూ డేట్ లో ఉన్నారనే విషయంపై క్లారిటీ వచ్చినట్లు అయ్యింది. అలాగే వీరిద్దరూ వెకేషన్ కోసం హాలిడే ట్రిప్ కి వెళ్లారని షేర్ చేసిన ఫోటోతో క్లారిటీ వస్తుంది. ఇదిలా ఉంటే సిద్ధార్ధ్ కి ఇప్పటికే పెళ్లయ్యింది. భార్యతో విభేదాల కారణంగా విడిపోయాడు. ఇక అదితీరావ్ హైదరీకి కూడా హీరోయిన్ గా పరిచయం కావడానికి ముందే పెళ్లి కావడం, విడాకులు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వీరిద్దరూ లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారని సిద్ధార్ధ్ ట్విట్టర్ విషెస్ ద్వారా క్లారిటీ వచ్చింది. మరి దీనిపై వారు ఏ విధంగా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.