వరసగా రెండు ఓటిటి రిలీజ్ లనంతరం నేచురల్ స్టార్ నాని నుండి వస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.వారి ఎదురుచూపులకు ఈ మూవీ తగిన న్యాయం చేసింది లేదో ఇప్పుడు చూద్దాం
స్టోరీ:
పెద్ద ఫిలిం డైరెక్టర్ కావాలని కలలుకంటున్న వాసు (నాని) తన కలను నెరవేర్చుకోవడానికి ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి అనుకుంటాడు.అందులో హీరోయిన్ గా చేయమని కీర్తి (కృతిశెట్టి) ఒప్పిస్తాడు. అలా చేసిన షార్ట్ ఫిల్మ్ హిట్ అవ్వడంతో వాసుకి పెద్ద మూవీ ఆఫర్ వస్తుంది.ఆ మూవీ హిట్ అవుతుంది. వాసు దశ మారిపోతుంది.ఇదే సినిమాని హిందీలో తీయాలని వెళ్లిన వాసుకి అక్కడ అనుకొని సమస్యలు ఎదురవుతాయి ఇంతకీ అవేంటి?అసలు వాసుకి,శ్యామ్ సింగ్ రాయ్ కు సంబంధం ఏంటి?శ్యామ్ సింగరాయ్, మైత్రి( సాయి పల్లవి) ప్రేమ కథ ఏమైంది?కీర్తి-వాసుల ప్రేమ సక్సెస్ అవుతుందా అనేవి తెలియాలంటే ఈ మూవీ చూడాలి.
విశ్లేషణ :
ఈ మూవీ ఫస్టాఫ్ మొత్తం వాసు హైలెట్ అయితే, సెకండాఫ్ అంతా శ్యామ్ సింగరాయ్ డామినేట్ చేస్తాడు.ఫస్టాఫ్ చాలా సరదాగా సాగుతుంది.వాసుకి తన గతం గుర్తొచ్చే సన్నివేశాలు బాగున్నాయి. శ్యామ్ సింగరాయ్ ప్రజల హక్కుల కోసం చేసిన పోరాటం,మైత్రితో ప్రేమ సన్నివేశాలు,విప్లవ రచయితగా మారిన తీరును దర్శకుడు స్క్రీన్ పై అద్భుతంగా చూపించారు.దర్శకుడు ఆడియెన్స్ అసహనానికి గురవకుండా సన్నివేశాలను,స్క్రీన్ ప్లే ను చాలా చక్కగా తీర్చిదిద్దారు.మూవీ క్లైమాక్స్ లో వచ్చే కోర్టు సీన్ మూవీకి హైలెట్ గా నిలిచింది.
పర్ఫార్మెన్స్ :
మూవీలో మెయిన్ లీడ్స్ గా కనిపించిన నాని,కృతి సెట్టి,సాయి పల్లవి తమ పర్ఫార్మెన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మడోన్నా సెబాస్టియన్ మిగతా నటి నటులు తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు.
ప్లస్ పాయింట్స్:
విజువల్స్ చాలా బాగున్నాయి.
ఇంటర్వెల్ బ్యాంగ్
నాని సాయి పల్లవి మధ్య వచ్చే సన్నివేశాలు
సాయి పల్లవి పర్ఫార్మెన్స్
సెకండ్ హాఫ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
క్లైమాక్స్ కోర్టు సీన్
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ సాగతీత
సాంగ్స్
కొన్ని సీన్స్ అనుకున్నంత పండలేదు
ఓవర్ ఆల్ రేటింగ్ :
ప్రమోషన్స్ సందర్భంలో చిత్ర యూనిట్ కనబరిచిన కాన్ఫిడెన్స్ సినిమా చూసిన వారికి అర్థమవుతుంది.వరసగా రెండు ఫ్లాప్స్ తో ప్రేక్షకులను నిరాశ పరిచిన నాని ఈ మూవీతో ఓ సాలిడ్ హిట్ ను సొంతం చేసుకున్నారు.ప్రస్తుతం పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్న ఈ మూవీకి 3.5/5 రేటింగ్ ఇవ్వచ్చు.