బ్యాక్ టు బ్యాక్ ఓటిటి రిలీజ్ లనంతరం నాని శ్యామ్ సింగరాయ్ మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి థియేటర్స్ కు రానున్నారు.ఈ క్రిస్మస్ కు ప్రేక్షకులకు ముందుకు రానున్న ఈ మూవీకి ప్రస్తుతం వరస షాక్ లు ఎదురవుతున్నాయి.డిసెంబర్ 3న రావాల్సిన వరుణ్ తేజ్ గని మూవీ బాలకృష్ణ అఖండ డిసెంబర్ 2న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తన డేట్ ను మార్చుకొని శ్యామ్ సింగరాయ్ మూవీతో బాక్స్ ఆఫీస్ బరిలో పోటీ పడనున్నది.
ఈ మూవీతో పాటు నాని శ్యామ్ సింగరాయ్ మూవీ కళ్యాణ్ రామ్ బింబిసారతో పోటీ పడాల్సి వస్తుంది దీంతో రిలీజ్ డేట్ ను మార్చాలా లేక అదే డేట్ కు ప్రేక్షకుల ముందుకు వెళ్ళాలా అనే డైలమాలో చిత్ర యూనిట్ ఉన్నట్టు సమాచారం.