నేచురల్ స్టార్ నాని క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ శ్యామ్ సింగరాయ్. పీరియాడికల్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. హీరో నాని కెరీర్లో ఈ మూవీ మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ గా నిలిచింది. వెస్ట్ బెంగాల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి పల్లవి దేవదాసి పాత్రలో కనిపించి మెప్పించింది. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి క్లాసికల్ డాన్స్ తో కూడా సాయి పల్లవి మెస్మరైజ్ చేసింది. ఇక నాచురల్ స్టార్ నాని రెండు పాత్రల్లో నిర్మించారు. పునర్జన్మ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
ఈ సినిమాలో సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మూవీ సక్సెస్ లో భాగం అయ్యాయి. ఇలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఇండియా నుంచి ఆస్కార్ నామినేషన్ కు వెళ్లే మూవీస్ కేటగిరిలో శ్యామ్ సింగరాయ్ కూడా భాగమైంది. ఈ సినిమా ఏకంగా మూడు కేటగిరీల్లో నామినేషన్లు పరిశీలనకి వెల్లడ విశేషం. పీరియాడికల్ స్టోరీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, క్లాసికల్ డాన్స్ క్యాటగిరిలలో ఆస్కార్ నామినేషన్ కు ఈ సినిమా వెళ్లడం జరిగింది. ఈ ఆస్కార్ నామినేషన్ నుంచి మెయిన్ ఆస్కార్ పోటీలకు శ్యామ్ సింగరాయ్ వెళితే మాత్రం ఖచ్చితంగా సంచలనమే అవుతుంది.
రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నాని కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన. కలెక్షన్ల పరంగా కూడా నాని కెరీర్లో హయ్యస్ట్ షేర్స్ రాబట్టిన మూవీగా ఈ చిత్రం నిలిచిపోయింది. యంగ్ హీరోయిన్ కృతిశెట్టికి కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అందించింది. ఓవరాల్ గా కరోనా కష్టకాలం తర్వాత ప్రేక్షకుల ముందుకు సూపర్ టాప్ సొంతం చేసుకున్న చిత్రంగా ఈ చిత్రం నిలిచిపోయింది.