సౌత్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి శృతి హసన్. కమల్ హసన్ కూతురు అనే బ్రాండ్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అతి తక్కువ కాలంలోనే సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మారిపోయింది. కెరియర్ ఆరంభంలో ఫ్లాప్ లు ఎదురైన తరువాత గబ్బర్ సింగ్ సినిమాతో సక్సెస్ కొట్టింది. ఈ సినిమా తర్వాత క్రేజీ హీరోయిన్ గా సక్సెస్ అయ్యింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణకి జోడీగా ఓ సినిమాలో నటిస్తుంది. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. దీంతో పాటు ప్రభాస్ కి జోడీగా పాన్ ఇండియా మూవీ సలార్ లో కూడా హీరోయిన్ గా శృతి హసన్ నటిస్తుంది.
View this post on Instagram
ఈ రెండు సినిమాలు మాస్ ఆడియన్స్ కి రీచ్ అయ్యే సినిమాలే కావడంతో వీటిపై అమ్మడు ఎక్కువ హోప్స్ పెట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది . దీనికి కారణం ఈ వీడియోలో ఈ బ్యూటీ ఫుల్ బ్లాక్ జంప్ షూట్ ధరించింది. దానికితోడు రెండు జాడలు వేసుకుంది. అందులో ఫుల్ గా చిల్ అవుతూ తన తండ్రి సూపర్ హిట్ సాంగ్ అయిన రాజా చేయివేస్తే అనే మాటకి డాన్స్ మూమెంట్ చేసింది. ఈ డాన్స్ మూమెంట్ తో అమ్మడు అందరికి ఫిదా చేసింది. ఇక ఈ డాన్స్ మూమెంట్ కి డాన్స్ చేయడం ద్వారా శృతి హాసన్ కి తన తండ్రి మీద ఉన్న ప్రేమని చూపించింది. ఈ సాంగ్ ని ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లో ఏకంగా రెండు లక్షల 71వేలమంది వీక్షించడం విశేషం.