Shruthi Haasan: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె టాలీవుడ్ హీరో విశ్వ నటుడు కమలహాసన్ కూతురిగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కమల్ హాసన్ కూతురిగా ఎంట్రీ ఇచ్చిన శృతి హీరోయిన్ గా తన కంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది.
మొదట్లో వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోయిన శృతి ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత మాస్ మహారాజ రవితేజ నటించిన క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిందీ.
కాగా ఈ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ అవ్వడంతో వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. కాగా ప్రస్తుతం శృతిహాసన్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈమె ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమాతో పాటుగా బాలకృష్ణ సరసన ఎన్‌బీకే107, చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాలలో నటిస్తోంది. ఈమె కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తనకు తన బాయ్ ఫ్రెండ్ హజారీకా కీ సంబంధించిన ఫోటోలను వీడియోలను పంచుకుంటూ ఉంటుంది.
అప్పుడప్పుడు వీరిద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఈసారి శృతిహాసన్ తన బాయ్ ఫ్రెండ్ తో కాకుండా తన ఫ్రెండ్స్ తో వెకేషన్ కు వెళ్ళినట్లు తెలుస్తోంది. తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఆ ఫోటోలను బట్టి చూస్తే ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో కాకుండా తన ఫ్రెండ్స్ తో కలిసి ఏదో వెకేషన్కు వెళ్లి అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అక్కడ దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ నే ఉంది.