Shruthi Haasan: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ హీరో, నటుడు కమలహాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ హీరోయిన్ గా తన కంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది.
ప్రస్తుతం శృతిహాసన్ వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈమె రవితేజ నటించిన క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకుంది. రీ ఎంట్రీ తోనే మంచి హిట్ సాధించడంతో ఈమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి.
శృతి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే బాలకృష్ణ సరసన ఎన్‌బీకే107, చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా నటిస్తోంది.
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. స్టార్ హీరోయిన్ అయిన శృతిహాసన్ కు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అభిమానులతో ముచ్చటిస్తూ తనకు తన బాయ్ ఫ్రెండ్ హజారికా కు సంబంధించిన విషయాలను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది.
ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు ఈమె హాట్ ఫోటోషూట్ లో కూడా చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈమె తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ముంబైలో ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఫ్యామిలీకి దూరంగా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి జీవనం సాగిస్తోంది శృతిహాసన్. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మకు ఇంస్టాగ్రామ్ లో బాగానే ఫాలోవర్స్ ఉన్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె బెడ్ పై పడుకుంది. అందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలపై శృతిహాసన్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.