Shriya Saran: మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన దృశ్యం సినిమా దాదాపు అన్ని భారత భాషల్లో రీమేక్ అయ్యింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన దృశ్యం2 మూవీ కూడా ఇప్పటికే తెలుగులో రీమేక్ కాగా, బాలీవుడ్‌లోనూ షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధమయ్యింది. ఇందులో అజయ్ దేవగణ్, శ్రియ, టబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో అగ్ర తారలంతా పాల్గొన్నారు. బాలీవుడ్‌లో నేడు విడుదలైన సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.
స్టేజీపైనే లిప్ కిస్
ఇకపోతే ఇటీవల మూవీ స్పెషల్ ప్రీమియర్ షోకు నటులంతా వారి భాగస్వాములతో హాజరయ్యారు. అజయ్ దేవగన్ తన భార్య కాజోల్‌తో వచ్చి ఫొటోలకు ఫోజు ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. అలాగే శ్రియ తన భర్తతో హాజరయ్యింది. ఆ కార్యక్రమంలో స్టేజీపైనే వారు లిప్ కిస్ పెట్టుకోవడం సోషల్ మీడియాలో వైరలవుతోంది. వీరు హాలీవుడ్ స్టార్లను మించిపోతున్నారుగా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
హీరోయిన్‌గా శ్రియ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి రెండు దశాబ్దాలు అయ్యింది. మోడలింగ్ రంగంలో సందడి చేస్తోన్నప్పుడే శ్రీయ సరన్ ‘ఇష్టం’ అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘సంతోషం’తో కెరీర్‌లో ఫస్ట్ హిట్‌ను అందుకుంది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడని ఈ భామ.. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకెళ్లింది. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు అందరు అగ్రహీరోలతో నటించింది. ఇప్పటికీ ఏమాత్రం అందం తగ్గలేదు. పైగా మరింత అందాల ఆరబోత ఈ మధ్య కాలంలో చేస్తోంది. హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తోంది.
Shriya Saran:
అప్పట్లో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చిన శ్రీయ సరన్.. ఈ మధ్య కాలంలో వెండితెరపై పెద్దగా సందడి చేయడం లేదు. కానీ, సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటూ వస్తోంది. అంతేకాదు, ఇందులో భాగంగానే తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తాజాగా దృశ్యం2 సినిమా ద్వారా బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.