Shriya Saran: ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినా శ్రియా సరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు ఈమె టాలీవుడ్ లో అగ్ర హీరోలు అయినా బాలకృష్ణ, ఎన్టీఆర్,నాగార్జున, చిరంజీవి లాంటి హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
అంతే కాకుండా హీరోయిన్ గా కొద్దిరోజులపాటు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది. తెలుగుతోపాటు పాన్ ఇండియా భాషలన్నింటిలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇష్టం, చెన్నకేశవరెడ్డి, ఠాగూర్, సంతోషం, నీకు నేను నాకు నువ్వు,ఎలా చెప్పను,నువ్వే నువ్వే, నేనున్నాను ఇలాంటి మంచి మంచి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రియా సరన్.
ఇకపోతే ఇటీవలే ఈమె ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిన్న పాత్రలో నటించి మెప్పించింది.
శ్రియా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటూ తనకు, తన భర్త, కూతురికీ సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ఇకపోతే ఈ మధ్యకాలంలో శ్రియా సరన్ తన అందాల ఆరబోత విషయంలో కాస్త డోస్ ని పెంచింది. సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ యూత్ కి పిచ్చెక్కిస్తోంది. కాగా తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఆ ఫోటోలలో శ్రియా సరన్ ఏంజెల్ లాగా ఉంది. వైట్ కలర్ డ్రెస్ అందుకు తగ్గ జ్యువెలరీ వేసుకొనీ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలను చూసిన అభిమానులు ఇప్పటికీ అదే అందం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.