Shriya Saran: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఇష్టం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రియ మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా ఈ సినిమా విడుదల కాకుండానే ఈ ముద్దుగుమ్మ ఏకంగా నాలుగు సినిమా అవకాశాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక నాగార్జున సరసన నటించిన సంతోషం సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న శ్రియ తన కెరీయర్ లో వెను తిరిగి చూసుకోలేదు.
ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆగ్ర హీరోలు అందరు సరసన నటించి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా విక్రమ్, రజనీకాంత్ వంటి సూపర్ స్టార్ హీరోల సరసన నటించిన మంచి గుర్తింపు పొందారు. ఇక ఈమె ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న సమయంలో ఒక్కో సినిమాకు కోటి రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్నారు.
ఇలా అగ్ర తారగా కొనసాగుతున్న సమయంలో ఒక్కో సినిమాకు కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోవడమే కాకుండా ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఒక్కో యాడ్ కి సుమారు 50 లక్షలకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్నారు. ఇక ఈమె ఇండస్ట్రీకి దూరమైన అనంతరం ఫోటోగ్రాఫర్ అండ్రీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. ఇలా వైవాహిక జీవితంలో స్థిరపడిన ఈమె ఇప్పటికీ పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
Shriya Saran: వందల కోట్ల ఆస్తి కలిగిన శ్రియ…
ఈ విధంగా దశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగినటువంటి శ్రియ భారీగానే ఆస్తులను కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఇలా ఈమెకు ప్రస్తుతం అడపా అవకాశాలు వచ్చినప్పటికీ ఈమె సంపాదించిన ఆస్తి తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరి షాక్ అవ్వాల్సిందే.ప్రస్తుతం శ్రియా వద్ద 15 మిలియన్ డాలర్లు ఆస్తులున్నట్టు తెలుస్తుంది. దీని వాల్యూ దాదాపు 100కోట్లు పైనే ఆస్తి ఉన్నట్టు సమాచారం. ఇవే కాకుండా ఖరీదైన కార్లు బంగ్లాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.