టాలీవుడ్ లో దశాబ్ద కాలం పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి శ్రియ శరన్. టాలీవుడ్ లో సుమారు స్టార్ హీరోలు అందరితో ఈ అమ్మడు కలిసి నటించింది. మెగాస్టార్ చిరంజీవి లాంటి అగ్ర హీరోల నుంచి తరుణ్ లాంటి ఆ కాలం యంగ్ హీరోల వరకు అందరితో శ్రియ హీరోయిన్ గా ఆడిపాడింది.
గ్లామర్ తో పాటు, నటనతో కూడా ఈ బ్యూటీ తెలుగు ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. ఇక టాలీవుడ్ లో కాజల్, సమంత, తమన్నా లాంటి హీరోయిన్స్ హవా మొదలైన తర్వాత శ్రియ ఫేమ్ మెల్లగా తగ్గుతూ వచ్చింది. దీంతో మెయిన్ హీరోయిన్ పాత్రల నుంచి ఫీమేల్ సెంట్రిక్ కథలు, సీనియర్ హీరోలకి జోడీగా ఈ బ్యూటీ సినిమాలు చేస్తూ వచ్చింది.
ఇక పెళ్లి తర్వాత ఫారిన్ లో ఈ బ్యూటీ సెటిల్ అయిపొయింది. ఒక పాపకి కూడా జన్మనిచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో మళ్ళీ సినిమాలలో అవకాశాల కోసం ఈ అమ్మడు ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీంతో కోసం రెగ్యులర్ గా తన గ్లామర్ ని చూపిస్తూ హాట్ హాట్ ఫోటోషూట్ లతో రెచ్చిపోతుంది.
సోషల్ మీడియాలో హాట్ ఫోటోలని షేర్ చేస్తూ అవకాశాల కోసం గాలం వెలుస్తుంది. 40 ఏళ్ళ వయస్సులో కూడా తనలో అందం ఇంకా తగ్గలేదని ఐటెం సాంగ్స్ కి కూడా తాను సిద్ధం అనే సిగ్నల్స్ ఇస్తుంది.
ఇక తాజాగా శ్రియ శరన్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.చీరకొంగుతో పరువాలని కప్పుకుంటూ వయ్యారాలు ఒలకబోస్తూ కుర్రాళ్లని రెచ్చగొట్టే విధంగా ఉన్న ఆ ఫోటోలు ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటున్నాయి.