Shriya Saran : అందాల హాట్ బ్యూటీ శ్రియా హిందీలో రిలీజ్ అయిన దృశ్యం 2 సక్సెస్‌ను ఫుల్ లెన్త్ ఎంజాయ్ చేస్తోంది. అజయ్ దేవగన్, టబు, అక్షయ్ ఖన్నాతో శ్రియ కలిసి నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఓ వైపు తన విజయాన్ని ఎంజాయ్ చేస్తూనే ఈ బ్యూటీ హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తోంది. తన గ్లామర్స్ ఫోటోలతో సోషల్ మీడియాలో మంటలు రేపుతోంది శ్రియ. తాజాగా వైట్ కలర్ చీరతో చేసిని ఫోటో షూట్ పిక్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది ఈ చిన్నది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Shriya Saran : ఫారెన్ బాయ్ ఫ్రెండ్‌తో సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని ఓ పాపకు జన్మనిచ్చినా కూడా శ్రియ అందాలు ఏమాత్రం తరగలేదు. అందుకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే ఫోటోలే నిదర్శనంగా నిలుస్తాయి. ఆఫ్టర్ మ్యారేజ్ తరువాత సెకెండ్ ఇన్నింగ్స్ ను ఫుల్ జోష్ లో ప్రారంభించింది శ్రియ. ఇటీవల విడుదలైన దృశ్యం 2 కూడా ప్రేక్షకాధరణ లభిస్తుండటంతో అమ్మడి ఆనందానికి అవధులు లేవు.

ప్రమోషన్ ఈవెంట్ల దగ్గరి నుంచి సక్సెస్ మీట్ ల వరకు ఈ భామ ఒక్కో అవుట్‌ఫిట్‌తో దర్శనమిస్తూ ఫ్యాన్స్ హృదయాలను దోచేస్తోంది. తాజాగా ఈ చిన్నది కోకోనట్ రఫెల్డ్ చీరను కట్టుకుని హాట్ ఫోటో షూట్ చేసి అందరిని మంత్రముగ్ధులను చేసింది.

ప్రముఖ్ ఫ్యాషన్ డిజైనర్ అర్పితా మెహతా డిజైన్ చేసిన ఈ వైట్ కలర్ రఫెల్డ్ చీరలో ఎంతో అందంగా కనిపించింది శ్రియ. ఈ రఫెల్డ్ చీరకు జోడీగా ప్లంగింగ్ నెక్‌లైన్ బెల్ట్ డీటెయిల్స్ కలిగిన స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకుని అదరగొట్టింది. ఈ అవుట్‌ఫిట్‌కు సెట్ అయ్యేవిధంగా ఆక్సిడైజ్డ్ ఆభరణాలను ఎన్నుకుంది శ్రియ. మెడలో భారీ నెక్‌లెస్ పెట్టుకుని చెవులకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్‌ను ధరించింది. తన సాఫ్ట్ కురులను లూజ్ గా వదులుకుని ఎంతో హాట్ గా కనిపించింది ఈ చిన్నది. ఫేమస్ ఫ్యాషన్ స్టైలిస్ట్ జుకల్కర్ శ్రియకు స్టైలిష్ లుక్స్‌ను అందించాడు. మేకప్ ఆర్టిస్ట్ మహేంద్ర శ్రియ అందానికి మెరుగులు దిద్దగా, హెయిర్ స్టైలిస్ట్ ప్రియాంక లవ్లీ లుక్ ను అందించింది.

ఇటీవల గోవాలో జరిగిన 53వ IFFIలో తన సినిమా ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన శ్రియ ఈ ఈవెంట్ కోసం అందమైన బ్రైట్ రూబీ రెడ్ సిల్క్ ఆర్గాన్జా చీరను ధరించింది. ఫ్యాషన్ లేబుల్ టొరాని షెల్ఫ్ నుంచి ఈ ఎత్నిక్ వేర్‌ను సెలెక్ట్ చేసుకుంది.

మెషిన్ తో పాటు హ్యాండ్ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన ఈ చీరలో అందరిని మంత్రముగ్ధులను చేసింది శ్రియా. ఈ చీరకు జతగా స్వీట్‌హార్ట్ నెక్‌లైన్‌తో ఎంబ్రాయిడరీ చేసిన త్రీ-ఫోర్త్ స్లీవ్స్ బ్లౌజ్ ను వేసుకుంది.

చేతులకు వెండి స్టేట్‌మెంట్ బ్యాంగిల్స్‌తో పాటు చెవులకు భారీ బంగారు జుంకాలను అలంకరించుకుంది. కళ్లకు ఐలైనర్, మస్కరా, డస్కీ ఐ ష్యాడో వేసుకుని పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకుంది. మెరిసేటి ఛర్మంతో అందరిని మైమరపించింది. అంతే కాదు తన కురులతో అందమైన కొప్పును తీర్చిదిద్దుకుని గులాబీ పూలను అలంకరించుకుని సంప్రదాయ లుక్‌తో సందడి చేసింది. ఈ అద్భుతమైన చీరతో దిగిన ఫోటోలను ఈ బ్యూటీ తన ఇన్‌స్టాలో షేర్ చేసి ఫాలోవర్స్‌ను ఖుషీ చేసింది.
