Shriya Saran : సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 20 ఏళ్ళు అవుతున్నా ఇంకా నవ యువనాయకిలాగే తళుక్కుమటోంది నటి శ్రియ శరన్. అసాధారణమైన నటన నైపుణ్యంతో అందమైన హావభావాలు, అల్ట్రా గ్లామ్ లుక్స్ తో టాలీవుడ్, కోలీవుడ్ లోనూ బెస్ట్ హీరోయిన్ గా రాణిస్తోంది శ్రియ. ఈ మధ్యన ఈ బ్యూటీ సోషల్ మీడియా పోస్టుల ద్వారా తన ఫాలోవర్స్ ను అప్డేట్ చేస్తోంది.

Shriya Saran : శ్రియకు అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్ ఉంది అందుకు తగ్గట్లుగానే శ్రియ అకేషన్ కు తగ్గట్లుగా అవుట్ ఫిట్స్ ధరిస్తూ మెస్మరస్ చేస్తుంటుంది. ఎత్నిక్ అయినా వెస్ట్రన్ అయినా తన ఫిగర్ కు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేలా చూసుకుంటుంది.

తాజాగా అజయ్ దేవగన్ తో కలిసి దృశ్యం 2 సినిమాతో ప్రేక్షకులను మరోసారి అలరించింది శ్రియ. ఓ ఈవెంట్ కోసం ఈ చిన్నది బ్లూ మిడి డ్రెస్ ను వేసుకుని అదరగొట్టింది. ఫ్యాషన్ డిజైనర్స్ గౌరీ నైనికల ఫ్యాషన్ టేబుల్ నుంచి ఏ అవుట్ ఫిట్ ని ఎన్నుకుంది.

బ్లాక్ కలర్ టైని డాట్స్ తో వచ్చిన ఈ బ్లూ కలర్ పొల్కా డాట్ డ్రెస్ లో రెట్రోఫీల్ ను కలిగించింది శ్రియ. ఆఫ్ షోల్డర్స్ ప్లగ్ ఇన్ నెక్ లైన్ తో వచ్చిన ఈ డ్రెస్ లో శ్రియ తన అందాలను ఆరబోసింది.

టుల్లే ఎంబ్రాయిడరీ మెష్ తో చేసిన పఫ్ డిజైన్ స్కర్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ గౌను ధర అక్షరాల రూ.44 వేలు. ఈ లైట్ కలర్ అవుట్ ఫిట్ కు మ్యాచ్ అయ్యేలాగా చిన్నటి డైమండ్ ఇయర్ రింగ్స్ తో తన చెవులను అలంకరించుకుంది. కనులకు న్యూడ్ ఐ ష్యాడో, బ్లాక్ ఐ లైనర్, మస్కరా వేసుకొని ఐబ్రోస్ ని డార్క్ చేసి పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకొని ఫాన్స్ ను మంత్రముగ్ధులను చేసింది.

ఈ మధ్యనే దృశ్యం 2 ప్రమోషన్స్ కోసం అద్భుతమైన మెరూన్ సీక్విన్ చీరలు కట్టుకొని అదరగొట్టింది. ఈ మెరుపుల చీరలో తన అందాలను హైలెట్ చేస్తూ మెస్మరైజ్ చేసింది శ్రియ. స్కూల్ నెక్ లైన్ తో వచ్చిన సాలిడ్ మెరూన్ బ్లౌజ్ మీద జాత చేసి కెమెరాకు హాట్ ఫోజులు ఇచ్చింది. శారీ లుక్ లోను కత్తిలా ఉంటానంటూ మరోసారి నిరూపించింది.
