Shriya Saran : మాల్దీవుల్లో తన బర్త్‌డే ను ఫుల్‌లెన్త్ గా ఎంజాయ్ చేస్తోంది సౌత్ బ్యూటీ శ్రియా శరణ్. సాగర తీరంలో బికినీ అందాలను ప్రదర్శిస్తూ బోల్డ్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇస్తోంది ఈ చిన్నది . శ్రియ తన పుట్టిన రోజు సందర్భంగా వేసుకున్న మెజెంటా బికినా ఫ్యాషన్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఫ్రంట్ నాట్స్‌తో వచ్చిన ఈ స్ట్రాపీ బికినీ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది శ్రియా. ఈ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడు ధరించిన కలర్‌ఫుల్ బికినీ అద్భుతంగా ఉందంటూ తన ఫాలోవర్స్ పొగడ్తలతో శ్రియను ముంచేస్తున్నారు. బర్త్‌డే సందర్భంగా విషెస్ చెబుతున్నారు ఫ్యాన్స్. మీ ప్రేమకు ధన్యవాదాలని శ్రియ పేర్కొంది.

Shriya Saran : తన కుటుంబ సభ‌్యులతో కలిసి బర్త్‌డే హాలిడేను ఎంజాయ్ చేస్తోంది శ్రియ. ఈ హాలిడేను మాల్దీవ్స్‌లో గడుపుతున్నందున ఈ చిన్నది విభిన్న స్టైల్స్‌లో ఉన్న బికినీలను ధరించి హాలిడే ఫ్యాషన్‌ను ప్రమోట్ చేస్తోంది. పచ్చటి చెట్ల నడుమ పొద్దుతిరుగుడు రంగులో ఉన్న ట్రెండీ బికినీ వేసుకుని సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది శ్రియా. ఈ పిక్‌కు మంచి స్పందన లభించింది.

శ్రియా తన చిట్టిపొట్టి చిన్నారి కూతురుతో బీచ్‌లో గడపడం చాలా ఇష్టపడుతుంది. ఈ సందర్ంగా వైట్ కలర్ స్ట్రాప్‌లెస్ బికినీ వేసుకుని తన చిన్నదానికి బేబీ బికినీ వేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. సాగర తీరంలో దిగిన ఈ పిక్ ఎంతో క్యూట్‌గా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Shriya Saran : బికినీలతో బీచ్‌లో సందడి చేయడం శ్రియకు కొత్తేమి కాదు. ఈ మధ్యనే ఈ బ్యూటీ గోవా వెకేషన్‌లో ఉన్నప్పుడు పింక్ కలర్ బికినీ వేసుకుని తన కూతురు, భర్తతో ఎంజాయ్ చేసింది. ఇసుకుపై పడుకుని అలా అలా అలలు తాకుతూ ప్రకృతిని తనివితారా ఆస్వాధించిన పిక్స్ కూడా ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.