Shreyas Iyer: టీమిండియా క్రికెటర్లు టీ20 వరల్డ్ కప్ కి ముందు తమ సత్తాని చాటుతున్నారు. అందులో మరీ ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ అయితే దుమ్మురేపుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ కి నేను సిద్ధంగా ఉన్నానంటూ సంకేతాలిస్తున్నాడు. గత ఆరు మ్యాచుల్లో అతడి ఆటతీరును చూసిన వాళ్లెవరైనా అరె వాహ్ అని మెచ్చుకోవాల్సిందే.
సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో మొదటి మ్యాచులో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్.. రెండో మ్యాచులో తన సెంచరీతో టీంని గెలిపించాడు. 279 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన టీమిండియాలో ఇషాన్ కిషన్ 93 పరుగులు చేయగా.. శ్రేయస్ అయ్యర్ ఏకంగా 113 పరుగులు (నాటౌట్) చేయడం మ్యాచును మన సొంతం చేసింది.
గత ఐదు వన్డే ఇన్నింగ్స్ లో శ్రేయస్ అయ్యర్ అదరగొట్టేశాడు. ఇప్పటి వరకు 4 హాఫ్ సెంచరీలు చేయగా, ఒక సెంచరీతో అదరగొట్టేశాడు. తాను ఫాంలో ఉన్నానని నిరూపించుకోవడంలో శ్రేయస్ పూర్తిగా సక్సెస్ అయ్యాడని క్రికెట్ అభిమానులు చెబుతున్నారు. మామూలుగా అయితే షార్ట్ పిచ్ బాల్స్ ని ఎదుర్కోవడంలో శ్రేయస్ అయ్యర్ కాస్త ఇబ్బందిపడుతుంటాడు కానీ సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో మాత్రం అదే బాల్ ను బౌండరీ దాటించి సెంచరీ పూర్తి చేశాడు.
Shreyas Iyer:
శ్రేయస్ అయ్యర్ ఆడిన గత ఆరు వన్డేల లెక్కలు చూస్తే ఎవరికైనా అయ్యర్ అదరొట్టేస్తున్నాడనే విషయం అర్థమవుతోంది. చివరి ఆరు వన్డే ఇన్నింగ్స్‌ల్లో అయ్యర్ స్కోర్లు వరుసగా.. 113*(111), 50 (38), 44 (34), 63 (71), 54 (57), 80 (111). టీమిండియాలో బలమైన క్రికెటర్ గా మారడానికి శ్రేయస్ అయ్యర్ పూర్తిగా సిద్ధమైపోయినట్లు కనిపిస్తుండగా.. ఈ సంవత్సరం వన్డేల్లో అతడి యావరేజ్ స్కోర్ 57.25 గా ఉంది.