ఈ మధ్యకాలంలో తెలుగు అమ్మాయిలు బాలీవుడ్ భామలకు ఏ మాత్రం తీసిపోకుండా అందాల ఆరబోతలో మేమున్నాం అంటూ ముందుకి వస్తున్నారు. బుల్లితెర భామల నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు ఎవరికి వారు కాస్ట్యూమ్స్ విషయంలో రోజు రోజుకి తగ్గించేస్తూ అందాల జాతర చేస్తున్నారు. వాళ్ళకంటే మాకేం తక్కువ లేవని చూపించడానికి ఇన్స్టాగ్రామ్ ని వేదికగా మార్చుకుంటున్నారు. దీంతో తెలుగు భామలకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. తెలుగు సినిమాలలో రాకపోయిన హిందీలో అడపాదడపా సినిమాలు చేసే ఛాన్స్ లు వస్తున్నాయి. కొంత మంది భామలు అయితే హిందీలో టాప్ స్టార్స్ గా మారిపోయారు. అలాగే హాలీవుడ్ లో కూడా పాగా వేయడానికి రెడీ అయిపోతున్నారు. అయితే తెలుగు నేటివిటీకి వీరు సెట్ కారనే ఉద్దేశ్యంతో తెలుగులో మాత్రం దర్శకులు ఛాన్స్ లు ఇవ్వడం లేదు.
ఇక్క ఇక్కడ చిన్న చిన్న సినిమాలు చేస్తూ హద్దులు దాటుతున్న కూడా పట్టించుకోవడం లేదు. దివి వాద్యా అందంతో ఇన్స్టాగ్రామ్ లో ఏ రేంజ్ లో హాట్ ప్రదర్శనలు ఇచ్చిన అవకాశాలు రావడం లేదు. అలాగే డింపుల్ హయాతి అయితే ఏకంగా బికినీలో కూడా కనిపించడానికి రెడీగా ఉంది. కానీ తెలుగు దర్శకులు పట్టించుకోకపోవడంతో హిందీలో, తమిళ్ లో ట్రై చేసుకుంటుంది. అలాగే శోభిత దూళిపాళ్ల హిందీ చిత్ర పరిశ్రమలో తెరంగేట్రం చేసి అక్కడే స్టార్ గా మారి ఇప్పుడు హాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. తెలుగులో మాత్రం రెండు సినిమాలకే పరిమితం అయ్యింది. ఇప్పుడు శ్రేయ ధన్వంతరి అనే తెలుగు భామ కూడా ఇక్కడి దర్శకులు పట్టించుకోకపోవడంతో హిందీలో కనిపించడానికి తాపత్రయ పడుతుంది.
ఈ నేపధ్యంలో అందాల ప్రదర్శనని ఆయుధంగా మార్చుకుంది. ఏ మాత్రం తగ్గకుండా బికినీ ఫొటోలతో రెచ్చిపోతుంది. తెలుగులో జోష్ సినిమాలో ఓ చిన్న పాత్రతో పరిచయం అయిన ఈ అమ్మడు తర్వాత స్నేహగీతం సినిమాలో ఒక హీరోయిన్ గా కనిపించింది. ఆ తరువాత నార్త్ ఇండియాకి వెళ్ళిపోయి అక్కడ షార్ట్ ఫిలిమ్స్ చేసి ఎలాగోలా హిందీ సినిమాలలో అవకాశాలు అందిపుచ్చుకుంది. వై చీట్ ఇండియా అనే సినిమాతో హిందీ సినిమాలలోకి అడుగుపెట్టింది. అలాగే వెబ్ సిరీస్ లలో సందడి చేస్తుంది. చివరిగా ఆమె స్కెమ్ 1992 సినిమాలో మెయిన్ హీరోయిన్ రోల్ పోషించింది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన సెమీ న్యూడ్ ఫోటోతో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.