సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా యాంకర్ అనసూయ, రౌడీ స్టార్ ఫాన్స్ మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో అనసూయ ట్విట్టర్ లో విజయ్ ని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ తో చిర్రెత్తుకొచ్చిన రౌడీ స్టార్ ఫాన్స్ ఒక్కసారిగా అనసూయపై విమర్శలు చేయడం మొదలు పెట్టారు. దానికి ఆమె కూడా అంతే స్థాయిలో రియాక్ట్ కావడంతో ఇద్దరి మధ్య వార్ నడుస్తుంది. ఇక ఈ ట్విట్టర్ వార్ లో కొంత మంది అనసూయని ఆంటీ అంటూ సంబోధించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అనసూయ అలా అంటే కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తా అంటూ హెచ్చరించింది.
దీనిపై నెటిజన్లు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి ఏ సెక్షన్స్ క్రింద కేసులు పెడతావో చెబితే కాస్తా తెలుసుకుంటాం అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే ఈ ట్విట్టర్ వార్ లోకి హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ వచ్చి చేరింది. యాంకర్ అనసూయకి మద్దతుగా నిలబడి నిన్ను ఎవరైనా ఆంటీ అంటారా. చాలా మంది కంటే నువ్వు అందంగా ఉంటావ్. నీ కంటే తక్కువ వయస్సు ఉన్నవారికంటే నువ్వు అందంగా కనిపిస్తావు. ఆంటీ అని అంటే వారికంటే మూర్ఖులు ఉండరంటూ కామెంట్స్ చేసింది. దీనికి అనసూయ కూడా థాంక్స్ చెప్పింది.
అనసూయకి సపోర్ట్ చేయడంతో శ్రద్ధా దాస్ మీద రౌడీ ఫాన్స్ దాడి మొదలు పెట్టారు. అనసూయ గురించి పూర్తిగా తెలుసుకొనే ఆమెకి సపోర్ట్ చేస్తున్నావా అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే ఆమె మీద కూడా ట్రోల్స్ మొదలు పెట్టారు. ఇక ఈ ట్రోల్స్ పై శ్రద్ధా దాస్ కూడా రియాక్ట్ అయ్యింది. నామీద ట్రోల్స్ చేస్తూ మీ సమయం వృధా చేసుకోవద్దు. అలాంటి పోస్టులని నేను డిలేట్ చేస్తాను, అలాగే మిమ్మల్ని బ్లాక్ చేస్తాను. మీ ట్రోల్స్ నన్ను ఏమీ చేయలేవు అంటూ పోస్ట్ చేసింది. ఇక ఈ వార్ ఎంత వరకు వెళ్తుంది అనేది ఇప్పుడు చూడాలి.