Shraddha Das: శ్రద్ధా దాస్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో వెండితెరకు పరిచయమైంది ఈ బ్యూటీ. మొదటి సినీమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధా ఆ తర్వాత తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి మంచి అవకాశాలను అందుకుంది.
అలా ఇప్పటివరకు దాదాపుగా ఐదు భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా 30కీ పైగా సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరుచుకుంది శ్రద్ధా దాస్. కానీ ఈమెకు ఊహించిన విధంగా మాత్రం అవకాశాలు రాలేదు.
ఆ తర్వాత అడపాదడపా క్యారెక్టర్ లలో నటించింది. అంతేకాకుండా ఆమె కెరీర్ లో చెప్పుకోదగ్గ సరైన హిట్టు కూడా లేదు. ప్రస్తుతం శ్రద్ధాదాస్ సినిమా అవకాశాలకు తోపాటు సరైన హిట్ సినిమా కోసం కూడా ఎదురుచూస్తోంది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శ్రద్ధా దాస్ ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ 14 షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.కథ కొన్ని ఎపిసోడ్ లుగా ఈమె ఢీ షోకి జడ్జిగా వ్యవహరిస్తూనే మధ్య మధ్యలో టీం లీడర్లతో కలిసి పంచులు వేస్తూ అలరిస్తూ వస్తోంది.
అయితే శ్రద్ధా దాస్ కు కావాల్సినంత అందం ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రావడం లేదు. స్టార్ హీరోయిన్లకు మించిన అందం ఈమెకు సొంతం.
అయితే శ్రద్ధా సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తరచూ సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో కుర్ర కారుకు అందాల కనివిందు చేస్తూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా శ్రద్ధా దాస్ కి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో అవుతున్నాయి. ఆ ఫోటోలలో పద్ధతిగా కనిపిస్తూనే తన అందాలతో యువత దృష్టిని ఆకర్షిస్తోంది. కాగా ఎందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వరులు అవుతున్నాయి. ఆ ఫోటోలలో ఆమె గ్రీన్ కలర్ లంగా ఓని ధరించింది.