Shradda Kapoor : బాలీవుడ్‌లో అప్ కమింగ్ మూవీ భేదియాలోని తుమ్కేశ్వరి పాటలో శ్రద్ధా కపూర్ స్పెషల్‌గా కనిపిస్తూ ఆమె అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. డార్క్ రెడ్ శారీ కట్టుకుని బోల్డ్ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ తో పాటు తన అందమైన ఒంపు సొంపులను చూపిస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ప్రస్తుతం ఈ స్పెషల్ సాంగ్‌తో పాటు అవుట్‌ఫిట్‌లోనూ ఎంతో హాట్ గా కనిపిస్తూ కుర్రాళ్లను ఇంప్రెస్ చేస్తోంది ఈ బ్యూటీ.

వరుణ్ ధావన్, కృతి సనన్ నటించిన భేడియా చిత్రంలోని తుమ్కేశ్వరి పాటలో అతిథి పాత్రలో కనిపించి అదరగొట్టింది శ్రద్దా కపూర్. కృతి సనన్, వరుణ్ ధావన్ లు సెక్సీ అవుట్‌ఫిట్స్‌ను వేసుకుని బ్యాక్ గ్రౌండ్ లో చాలా మంది డ్యాన్సర్లు డ్యాన్స్ చేస్తుండగా. మాంటేజ్ ముగింపులో, ప్రభాస్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ట్రాక్ మధ్య తన అందమైన ఎంట్రీతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. తన అద్భుతమైన కర్వ్స్‌తో క్రేజీ స్టెప్పులు, హాట్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. తాజాగా ఈ బ్యూటీ తన తుమ్కేశ్వరి లుక్‌కి సంబంధించిన పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి సందడి చేసింది . ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ స్పెషల్ సాంగ్‌లో మెరూన్ కలర్ శారీలో అందరిని మంత్రముగ్ధులను చేసింది శ్రద్దా కపూర్. చీరకు వచ్చిన ప్లీటెడ్ పల్లూ, డీప్ నెక్ బ్లౌజ్‌లో ఎంతో సెక్సీగా కనిపించింది . నడుముకు బంగారపు వడ్డానం , చేతికి వంకీ, చెవులకు గోల్డ్ టోన్డ్ ఇయర్ రింగ్స్ ముక్కుకు ముక్కెర నుదుటన పాపిటబిల్ల పెట్టుకుని తన అందాలతో యూత్ చూపును తనవైపు తిప్పుకుంది.

ఈ మధ్యనే ఈ బ్యూటీ ఆరేంజ్ కలర్ లెహెంగా సెట్ వేసుకుని అదరగొట్టింది. సింపుల్ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన దుపట్టాతో కలర్ ఫుల్స్ లుక్స్ తో యూత్‌ను కవ్వించింది ఈ చిన్నది. స్వీట్ హార్ట్ నెక్‌లైన్‌తో వచ్చిన సేమ్ ప్యాట్రన్ బ్రాలెట్ ఈ లెహెంగాకు స్పెషల్ లుక్ ను తీసుకువచ్చింది. మెడలో గొలుసు , చెవులకు దుద్దులు పెట్టుకుని క్యూట్‌నెస్‌తో కుర్రాళ్లను కూల్ చేసింది.

అంతకు ముందు ఓ ఫ్యాషన్ ఫోటో షోటో షూట్ కోసం శ్రద్దా బూడిద రంగు ఫ్రిల్డ్ చీరను కట్టుకుని మోడ్రన్ ఎత్నిక్ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చేసింది. హెవీ ఫ్రిల్స్‌తో లైట్ వెయిట్ తో వచ్చిన ఈ చీరలో ఎంతో హాట్ గా కనిపించింది శ్రద్దా.

ఈ చీరకు మ్యాచింగ్‌గా డీప్ స్వీట్ హార్ట్ నెక్ లైన్ తో వచ్చిన బ్రాలెట్ వేసుకుని తన ఎద అందాలను చూపించింది. భారీ ఆక్సిడైజ్డ్ జ్యువెర్లరీతో అందరిని అట్రాక్ట్ చేసింది. చేతికి గాజులు , మెడలో భారీ నెక్‌లెస్ , చెవులకు హూప్ ఇయర్ రింగ్స్, నుదుటన పాపిట బిల్ల పెట్టుకుని హాట్ నెస్‌తో యూత్ గుండెల్లో మంటలు రేపింది.
