Yash: “కేజిఎఫ్” రెండు పార్ట్ లతో హీరో యాష్ కి తిరుగులేని క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రాకముందు యాష్ పేరు కేవలం కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే వినబడేది. కానీ “కేజీఎఫ్” సినిమా విజయంతో హీరో యాష్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో యాష్ అరాచకం సృష్టించాడు. నటనలో తన విశ్వరూపం ఏంటో నిరూపించి..అనేక మంది అభిమానాన్ని సంపాదించాడు.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతి తక్కువ బడ్జెట్ సినిమాలు కన్నడ ఇండస్ట్రీలో తెరకెక్కిస్తారు… కన్నడ చలనచిత్ర రంగాన్ని లైట్ తీసుకునే క్రమంలో వచ్చిన “కేజిఎఫ్” సినిమా ప్రపంచాన్నే కన్నడ ఇండస్ట్రీ వైపు చూసేలా చేసింది. ముఖ్యంగా “కేజిఎఫ్” రెండో భాగం ఏకంగా ₹1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ప్రస్తుతం హీరో యాష్ తర్వాత సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. “Yash 19” వర్కింగ్ టైటిల్ పై ప్రాజెక్టు డిస్కషన్ జరుగుతుంది.
ఇలాంటి సమయంలో హాలీవుడ్ యాక్షన్ దర్శకుడు జేజే పెర్రీతో షూటింగ్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఆ గన్ షూటింగ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆ వీడియోలో హీరో యాష్ నెక్స్ట్ టైం ఇది..కలాష్ నికవో సీన్ అవుతుంది అంటూ ట్వీట్ చేశాడు. దీంతో “Yash 19” పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. కచ్చితంగా మళ్ళీ పవర్ ఫుల్ యాక్షన్ కంటెంట్ ఉన్న పాత్రలో యాష్ కనిపించనున్నట్లు తెలుస్తోంది.