రెమో,వరుణ్ డాక్టర్ మూవీస్ తో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్న తమిళ హీరో శివ కార్తికేయన్ తెలుగులో డైరెక్ట్ గా ఓ మూవీ చేయబోతున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది.దీనిపై తాజాగా స్పందించిన శివ కార్తికేయన్ ఇది నిజమేనని ఓ క్లారిటీ ఇచ్చారు.
జాతిరత్నాలు మూవీతో యువతకు బాగా దగ్గరైన అనుదీప్ కేవి ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు.ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP,శాంతి టాకీస్,సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు.తమన్ ఈ మూవీకి సంగీతం సమకూర్చనున్నారు.తెలుగులో శివ కార్తికేయన్ తొలిసారి చేస్తున్న మూవీ కావడంతో ఆయన అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.