Shilpa Shetty : 47 ఏళ్ల వయసులోనూ ఇంకా బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి అందాలు తరగలేదు. నాజూకు పరువాలతో ఇప్పటికీ ఆమె తన అభిమానులను అలరిస్తోంది. ఫిట్ నెస్ వీడియోలతో అప్పుడప్పుడు సోషల్ మీడియా లో పలకరించే ఈ బ్యూటీ లేటెస్ట్ గా అదిరిపోయే చీరకట్టుతో అందరి చూపులను తన వైపుకు తిప్పుకుంది ఈ చిన్నది. శిల్పా వైట్ శారీ తో మ్యాజిక్ చేసే అందరిని మెస్మెరైజ్ చేసింది.

టాలీవుడ్, బాలీవుడ్ లోనూ అత్యంత ఫిట్ గా ఉన్న నటీమణుల జాబితాలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కుంద్రా ప్రధమ స్థానంలో ఉంటుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. చెక్కిన శిల్పం లా ఉండే శిల్పా అందాలను చూస్తే ఈ విషయాన్నీ ఎవరైనా ఒప్పుకుని తీరుతారు. బాడీ ఫిట్ నెస్ తోనే కాదు ఆమె తన ఫ్యాషన్ సెన్స్ తోనూ ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేయగలదు. శిల్పా తరచుగా తన లేటెస్ట్ అవుట్ ఫిట్స్ ను ప్రదర్శిస్తూ చాలా ప్రశంసలను అందుకుంటుంది.
ఇటీవల, శిల్పా ఓ ఈవెంట్ కోసం తెల్లని చీరను కట్టుకుని క్లీవేజ్‌ను చూపిస్తూ అభిమానులను కవ్వించింది. శిల్పా తన టోన్డ్ బాడీని డీప్ నెక్‌లైన్ తో వచ్చిన బ్లౌజ్ ద్వారా ప్రదర్శించింది, అభిమానులు ఆమె అందానికి ఫిదా అయ్యేలా చేసింది.

శిల్పా తన ఇండో వెస్ట్రెన్ లుక్ చీర కట్టుతో అందరి హృదయాలను దొంగిలించింది. గోధుమ, బూడిద రంగు ల కలయికతో వచ్చిన బ్లౌజ్ వేసుకుంది. డీ నెక్ లైన్ స్లీవ్ లెస్ ఈ బ్లౌజ్ ను ఏంటో ట్రెండీ గా డిజైన్ చేసారు డేసిగ్నేర్స్ . ఈ బ్లౌజ్ కి జోడీగా తెల్లటి, శాటిన్ డ్రెప్ చీర ను జత చేసింది. ఈ ట్రెండీ శారీ లో దిగిన ఫోటోలను శిల్పా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి. ఈ రెండింటి కాంబినేషన్ అదుర్స్ అంటూ ఫాలోవెర్స్ కామెంట్స్ పోస్ట్ చేసారు.

ఈ శారీ కి సెట్ అయ్యేలా చేతులకు మల్టిపుల్ బ్యాంగిల్స్ ధరించి తన జుట్టును లూస్ గా వాదులుకుంది. శిల్పా మనోహరమైన రూపానికి ఆమె అభిమానులు మురిసిపోయారు. “నేను నా 20 ఏళ్ళలో ఎప్పుడూ ఇలా చూడలేదు ” అని ఒక అభిమాని పిక్స్ కింద కామెంట్ చేశాడు.
