Shilpa Shetty : ఎప్పుడూ అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూ స్టైలిష్ గా ఉండే శిల్పాశెట్టి మరోసారి తన లుక్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది . ఆమె ఇటీవల తన వర్డ్ రోబ్ నుంచి సౌకర్యవంతమైన ఫ్యాన్సీ దుస్తులలో ఒకదానిని ఎన్నుకుని సోషల్ మీడియా లో రెచ్చిపోయింది. ఆమె శాటిన్ గ్రీన్ ర్యాప్ డ్రెస్ ను వేసుకుని తెల్లటి స్నీకర్ షూస్ తో జత చేసి అదరగొట్టింది. 40 ప్లస్ వయసులోనూ వారేవా ఏం ఫిగర్ అని అనిపిస్తోంది.

Shilpa Shetty : శిల్పాశెట్టి లుక్ ఆఫ్ ది డే లో ఫుల్ స్లీవ్స్ , అసమాన హెమ్‌లైన్‌తో వచ్చిన ఆకుపచ్చ రంగు ర్యాప్ దుస్తులను ధరించింది. ఈ లుక్ కోసం శిల్పాశెట్టి లగ్జరీ హీల్స్‌ని వదిలేసి, ఒక జత సౌకర్యవంతమైన వైట్ ప్లాట్‌ఫారమ్ కలిగిన స్నీకర్ షూ లను వేసుకుంది.

ఈ గ్రీన్ కలర్ అవుట్ ఫిట్ లో తన థైస్ అందాలను చూపించి కుర్రాళ్ళ మతులు పోగొట్టింది. అప్డేటెడ్ ఫ్యాషన్ స్టైల్స్ తో కుర్ర హీరోయిన్ లకు పోటీ ఇస్తోంది శిల్పా. ఈ అవుట్ ఫిట్ తో దిగిన పిక్స్ ను శిల్ప తన ఇన్స్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. శిల్పాశెట్టి తన పోస్ట్‌కి దే సెడ్ గ్రీన్స్ ఆర్ గుడ్ అని క్యాప్షన్ ఇచ్చింది.

శిల్పాశెట్టి మల్టీ టాస్కింగ్ ఉమెన్ . ఎంటర్టైమెంట్ రంగంలో ఈ భామను బీట్ చేసే వారు ఎవరు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఓ వైపు బుల్లి తెరపై డాన్స్ షో కు జడ్జి గా వ్యవహరిస్తూనే మరోవైపు ఫుడ్ బిజినెస్ ఇంకోవైపు యూట్యూబ్ ఛానల్ , సోషల్ మీడియాతో పాటు యోగ క్లాసులు చెబుతూ అందరిని ఆకట్టుకుంటుంది.ఇన్ని పనులను చేస్తున్నప్పటికీ ఈ భామ ఎనర్జీ ఎప్పుడు వేరే లెవెల్ లో ఉంటుంది. అందుకే శిల్పా కు సోషల్ మీడియా లో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకు తగ్గట్లుగానే అందరిని తన ఫ్యాషన్ స్టైల్స్ తో ఇంప్రెస్స్ చేస్తుంటుంది.

ఈ మధ్యనే ఈ బ్యూటీ మరో అద్భుతమైన అవుట్ ఫిట్ తో ఇన్ స్టాలో సందడి చేసింది. పింక్ కలర్ చీరను కట్టుకుని ఫెస్టివ్ అండ్ ఎత్నిక్ ఫ్యాషన్ ను ప్రోమోట్ చేసింది. పింక్ బ్యాక్ డ్రాప్ లో గోల్డెన్ ప్రింట్స్ తో వచ్చిన ఈ శారీ లో అందమంతా శిల్పా సొంతమైనది.

ఈ చీర కు తగ్గట్లుగా మెడలో భారీ అందమైన ఎమెరాల్డ్స్ , ముత్యాలతో పొదిగిన చోకర్ నెక్ లెస్ పెట్టుకుని ఫ్యాషన్ ప్రియుల మనసు దోచేసింది.

రీసెంట్ గా జరిగిన ఓ ఫ్యాషన్ వీక్ లో స్టన్నింగ్ అవుట్ ఫిట్ వేసుకుని తన సోయగాలను రెడ్ కార్పెట్ పై పరిచింది. డాలీ జె స్టూడియో తరపున ర్యాంప్ వాక్ చేసి అందరిని ఇంప్రెస్స్ చేసింది శిల్పా శెట్టి . కట్ అవుట్ డీటెయిల్స్ తో వచ్చిన ఈ న్యూడ్ కలర్ లాంగ్ గౌన్ లో కట్టి లా కనిపించి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు రేపింది. ఈ అవుట్ ఫిట్ తో చేసిన పిక్స్ కూడా నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి.
