Shekhar Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ అంటే తెలియని వారు ఉండరు. తన అదిరిపోయే స్టెప్పులతో కుర్రకారులను బాగా ఆకట్టుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చిన మొదట్లో సినిమాలలో డాన్సర్ గా అడుగుపెట్టి కొరియోగ్రాఫర్ గా ఎదిగాడు.
మొదటిగా చిన్నచిన్న హీరోలకు డాన్స్ నేర్పించే స్టేజి నుంచి స్టార్ హీరోలకు స్టెప్పులు నేర్పించే స్టేజి వరకు వచ్చాడు. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇకపోతే ఇతనికి ఒక కొడుకు, కూతురు. తన వారసత్వాన్ని పంచుకొని తన కొడుకు, కూతురు కూడా అద్భుతంగా డాన్స్ చేస్తున్నారు.
అలాగే శేఖర్ బుల్లితెరలో కూడా తన టాలెంట్ ని చాటుకున్నాడు. తనకున్న క్రేజ్ కి బుల్లితెరలో కూడా ఎన్నో షోలలో తనకు అవకాశాలు వచ్చాయి. అనేక టీవీ ఛానల్ షోలకు జడ్జ్ గా చేశాడు. ప్రస్తుతం ఆహా లో ప్రసారమవుతున్న డాన్స్ ఐకాన్ లో జడ్జ్ గా, కొన్ని సినిమాలలో కొరియోగ్రాఫర్ గా పనిచేస్తూ బిజీగా ఉన్నాడు.
శేఖర్ మాస్టర్ ఢీ సోలో జడ్జిగా చేసేటప్పుడు రేటింగ్ బాగా ఉండేదని ఇప్పుడు రేటింగ్ సరిగ్గా లేదని అభిమానులు నిరాశ చెందుతున్నారు. తాజాగా శేఖర్ మాస్టర్ రెమ్యూనరేషన్ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో శేఖర్ మాస్టర్ ఒక్క పాట కొరియోగ్రాఫ్ చేయడానికి లక్షన్నర వరకు తీసుకునేవాడు.
Shekhar Master: శేఖర్ మాస్టర్ సంవత్సరానికి ఇంత సంపాదిస్తున్నాడా..
కానీ ప్రస్తుతం శేఖర్ మాస్టర్ సినీ ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్ కాకుండా, స్టార్ హీరోలతో కలిసి నటిస్తున్నాడు కాబట్టి తాజాగా శేఖర్ మాస్టర్ ఒక్కో పాట కొరియోగ్రాఫ్ కోసం దాదాపు నాలుగున్నర లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం.ఇంకా చెప్పాలంటే కొన్ని సినిమాలలో ఆ పాటలను బట్టి రేటు పెంచుతాడట. కొన్ని సినిమాలలో ఒకటి లేదా రెండు పాటలకు కొరియోగ్రాఫర్ గా చేస్తే దాదాపు పది లక్షలు అందుకుంటాడు. సినీ ఇండస్ట్రీలో ఈ టాప్ కొరియోగ్రాఫర్ సంవత్సరానికి దాదాపు 15 కోట్లు సంపాదిస్తున్నాడని సమాచారం.