Shehnaaz Gill : ఎప్పుడూ రీఫ్రెషింగ్ అప్ టు డేట్ ఫ్యాషన్ స్టైల్స్‌తో ఫ్యాషన్ ప్రియుల మనసు దోచుకుంటుంది బాలీవుడ్ బ్యూటీ షెహనాజ్ గిల్. అకేషన్ ఏదైనా అందుకు తగ్గట్లుగా స్టైలిష్ అవుట్‌ఫిట్స్‌ను ఎన్నుకుని ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తుంటుంది. ఫ్యాషన్ దుస్తుల ఎంపికలో ఈ బ్యూటీ ఎప్పుడూ నిరుత్సాహపరచలేదు. తాజాగా ట్రెడిషనల్ అవతార్‌లో దిగిన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మరోసారి తన ఫ్యాషన్ లుక్స్‌తో అందరినీ మంత్రముగ్ధులను చేసింది.

బ్లూ, రెడ్, పింక్ , ఎల్లో, గ్రీన్ షేడ్స్‌లో ఫ్లోరల్ ప్రింట్స్‌తో వచ్చిన పాస్టెల్ గ్రీన్ లెహెంగా వేసుకుని దివి నుంచి దిగివచ్చిన దేవకన్యలా మెరిసిపోయింది షెహనాజ్ గిల్. ఈ లెహెంగాకు మ్యాచింగ్‌గా పొడవాటి బెలూన్ స్లీవ్స్, ప్లంగింగ్ నెక్‌లైన్ తో ట్రెండీగా డిజైన్ చేసిన గ్రీన్ కలర్ బ్లౌజ్‌ను వేసుకుంది. ఈ బ్లౌజ్‌లో క్లీవేజ్ షో చేసి కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేసింది.

ట్రెడిషనల్ అవుట్‌కు సరిగ్గా నప్పే విధంగా మల్టీకలర్‌లో హెవీగా వచ్చిన నెక్‌లెస్ సెట్ ను మెడలో అలంకరించుకుంది. చెవులకు మ్యాచింగ్ ఇయర్‌రింగ్స్ చేతి వేళ్లకు ఉంగరాలు పెట్టుకుని అదరగొట్టింది. డివీ మేకప్ వేసుకుని, కనులకు మస్కరా, ఐ లైనర్ దిద్దుకుని పెదాలకు కోరల్ షేడ్ లిప్‌స్టిక్ పెట్టుకుని ఎంతో గ్లామరస్‌గా కనిపించింది షెహనాజ్ గిల్.

ఈ అద్భుతమైన లెహెంగా సెట్‌ను హౌజ్ ఆఫ్ నీతూ లుల్లా ఫ్యాషన్ లెబుల్ నుంచి సేకరించింది షెహనాజ్ గిల్. వర్ధాన్ నాయక్ అత్యద్భుతమైన మేకప్ లుక్స్ అందించగా , స్టైలిస్ట్ జున్నీ నవోమి షెహనాజ్ గిల్ కు స్టైలిష్ లుక్స్‌ను అందించారు. బల్జిత్ షెహనాజ్ గిల్ కు అందమైన హెయిర్ స్టైల్ వేసింది. జ్యువెల్లరీని మినెరాలీ స్టోర్ నుంచి సేకరిచింది.

వెండితెర, బుల్లితెరపైన తన అందమైన నటనతో, గ్లామరస్ లుక్స్‌తో అలరిస్తుంటుంది నటి , మోడల్, సింగర్ షెహనాజ్ గిల్. 2015లో మోడలింగ్ కెరీర్ ప్రారంభించిన షెహనాజ్ గిల్ ఓ పంజాబీ ఫిల్మ్‌తో తెరంగేట్రం చేసింది. 2019లో బిగ్‌బాస్ రియాలిటీ షోలో పాల్గొని మూడో స్థానంలో నిలిచింది. ఆ తరువాత నుంచి హిందీ సినిమాల్లో నటిస్తూ తన కెరీర్‌లో ముందుకెళ్తోంది షెహనాజ్ గిల్.
