Shehnaaz Gill : గత రెండు వారాలుగా బి-టౌన్ సెలబ్రిటీలు , స్టార్ లు తమ నివాసాల్లో గ్రాండ్ ఫెస్టివ్ పార్టీలను నిర్వహించే పనిలో మునిగిపోయారు. ఇప్పుడిప్పుడే ఫెస్టివ్ సీజన్ నుంచి బయటికి వస్తున్నారు . ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ ను పక్కన పెట్టి క్యాజువల్ వేర్ ను ఎంపిక చేస్తున్నారు. ఈ లోపే బి టౌన్ లో మరో పార్టీ కి సెలెబ్రిటీలకు ఇన్విటేషన్ వచ్చింది.

Shehnaaz Gill : సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ శర్మను వివాహం చేసుకున్న ఆయుష్ శర్మ తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు . చాలా మంది తారలు ఈ బర్త్ డే బాష్‌కి హాజరయ్యారు . అతిథి జాబితాలోని ప్రముఖులలో వర్ధమాన నటి ప్రీవియస్ బిగ్ బాస్ కంటెస్టెంట్ షెహనాజ్ గిల్ కూడా ఉంది. ఈ పార్టీ కోసం షెహనాజ్ గిల్ బూడిద రంగు ప్యాంట్ సూట్ , లేస్ షర్ట్ వేసుకుని అట్రాక్టీవ్ గా కనిపించింది.

షెహనాజ్ గిల్ అమేజింగ్ ప్యాంట్ సూట్‌ను ధరించి అద్భుతమైన ఫోటో షూట్ చేసింది . ఈ ఫోటో షూట్ పిక్స్ ను షెహనాజ్ గిల్ తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేసింది. ఈ పోస్ట్ కింద ” డూ వాట్ ఎవర్ మేక్స్ యూ హ్యాపీ ” అని క్యాప్షన్ ను జోడించింది.

ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. బాస్ బేబీ లుక్ లో సూపర్ గా ఉన్నావంటూ ఫాలోవర్స్ ఇన్ బాక్స్ లో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

షెహనాజ్ గిల్ ఈ అవుట్ ఫిట్ ను అర్జున్ రాంపాల్ గర్ల్ ఫ్రెండ్ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది. బ్లాక్ లేస్ షర్ట్ కి జోడీగా బూడిద రంగు వెయిస్ట్ కోట్, హై వెయిస్టెడ్ ప్యాంటు వేసుకుని అదరగొట్టింది.

డ్యాంగ్లింగ్ సింగిల్ స్టడ్ ఇయర్ రింగ్స్ , చేతి వేళ్ళకు స్టేట్‌మెంట్ ఉంగరాలను పెట్టుకుంది . కిల్లర్ హై హీల్స్‌తో కూడిన బ్లాక్ పాయింటెడ్ లెదర్ బూట్‌లు వేసుకుని స్టైలిష్ లుక్స్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేసేసింది.
