Shehnaaz Gill : ముంబైలో పార్టీలు , ఈవెంట్స్, ఫ్యాషన్ వాక్ లు, అవార్డ్స్ ఫంక్షన్ లు ఉంటే చాలు బాలీవుడ్ ముద్దుగుమ్మలందరూ అదిరిపోయే అవుట్ ఫైట్స్ తో మతులుపోగొడతారు. రీసెంట్ గా ముంబై లో జరిగిన ఓ స్క్రీనింగ్ ఈవెంట్ లో బాలీవుడ్ బ్యూటీ షెహనాజ్ గిల్ స్టన్నింగ్ అవుట్ ఫిట్ వేసుకుని కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేసింది. ఈ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ వివిధ బి-టౌన్ ఈవెంట్‌ల కోసం విభిన్న స్టైలిష్ అవుట్ ఫిట్స్ ను ధరించి తన అభిమానుల హృదయాలను దోచుకుంటోంది. లేటెస్ట్ గా ధరించిన బ్లాక్ అవుట్ ఫిట్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Shehnaaz Gill : ఈ స్క్రీనింగ్ అకేషన్ కోసం లేస్ డిటైల్డ్ షీర్ టాప్ , ఫ్లెయిర్డ్ ప్యాంట్ వేసుకుంది. ఈ అమేజింగ్ డ్రెస్ ను వెన్ను సెహెగల్ క్లోతింగ్ లేబుల్ షెల్ఫ్ నుంచి సేకరించింది ఈ చిన్నది. ఈ అవుట్ ఫిట్ తో రెడ్ కార్పెట్ పైన సందడి చేసి హాట్ ఫోటో షూట్ చేసింది. ఆ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఫాలోవర్స్ ను ఫిదా చేస్తోంది.

హై రైస్ నెక్ లైన్ , పఫెడ్ భుజాలు, పూల ఎంబ్రాయిడరీతో అలంకరించబడిన , లాంగ్ స్లీవ్‌లు కలిగిన పెప్లమ్ బ్లౌజ్ ను వేసుకుంది షెహనాజ్ గిల్. ఈ షీర్ లేస్ టాప్ కు మ్యాచింగ్ గా మిడ్ రైస్ వెయిస్ట్ లైన్ , సైడ్ స్లిట్స్, షీర్ లక్స్ తో ఎంబ్రాయిడరీ చేసిన సిల్క్ శాటిన్ ప్యాంట్స్ ను వేసుకుంది. చేతి వేళ్ళకు స్టేట్మెంట్స్ ఉంగరాలు , చెవులకు హూప్ ఇయర్ రింగ్స్ ను అలంకరించుకుంది. పాదాలకు పాయింటెడ్ బూట్స్ వేసుకుని తన లుక్ ను పూర్తి చేసింది ఈ బ్యూటీ.

ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా మెకోవర్ అయ్యింది షెహనాజ్ గిల్. కనులకు స్మోకీ ఐ ష్యాడో వేసుకుని, ఐ బ్రోస్ ను డార్క్ చేసి, మస్కారా దిద్దుకుంది. పేదలకు గ్లాసీ లిప్ షేడ్ పెట్టుకుని గ్లామరస్ లుక్స్ తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది షెహనాజ్ గిల్.
