Sharvari Wagh : యష్ రాజ్ ఫిల్మ్ బంటీ అవుర్ బబ్లీ 2 తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తన నటనతో అందరిని ఇంప్రెస్ చేసింది బాలీవుడ్ బ్యూటీ శార్వరి వాఘ్. తాజాగా ఈ చిన్నది బెస్ట్ డెబ్యూ అవార్డును అందుకుంది. దుబాయ్ లో జరిగిన ఈ అవార్డు ఫంక్షన్ కోసం ఈ అమ్మడు అదిరిపోయే డ్రెస్‌ను వేసుకుని అందరి చూపును తనవైపుకు తిప్పుకుంది. ఒంటికి అతుక్కుపోయేలా డిజైన్ చేసిన బాడీ హగ్గింగ్ డ్రెస్ వేసుకుని తన బోల్డ్ లుక్స్‌తో యూత్‌ను క్లీన్ బౌల్డ్ చేసింది శార్వరీ వాఘ్.

Sharvari Wagh : లేత గులాబీ రంగులో వచ్చిన స్ట్రాపీ డ్రెస్‌లో అప్సరసలా మెరిసింది శార్వరీ వాఘ్. దుబాయ్ మెరుపులకు తగ్గట్లుగా తన అందానికి మెరుగులు దిద్దింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రఫీక్ జాకీ ఫ్యాషన్ లేబుల్ నుంచి అద్భుతమైన డిజైన్స్‌లో వచ్చిన ఈ బాడీ హగ్గింగ్ డ్రెస్‌ను ఎన్నుకుంది శార్వరీ వాఘ్. వి నెక్‌లైన్, రంగురంగుల హ్యాండ్ మేడ్ గ్లిట్జీ ఎంబ్రాయిడరీతో వచ్చిన ఈ డ్రెస్‌లో ఎంతో హాట్‌గా కనిపించింది ఈ చిన్నది. అదే విధంగా తొడ వరకు వచ్చిన స్లిట్ తన థైస్ అందాలను ఎలివేట్ చేశాయి. డీప్ నెక్‌లైన్ తో వచ్చిన ఈ అవుట్‌ఫిట్‌లో తన ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొట్టింది ఈ బ్యూటీ.

ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా పాదాలకు గోల్డెన్ స్ట్రాపీ హీల్స్‌ను వేసుకుంది శార్వరీ. చెవులకు హూప్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. తన కురులతో మధ్యపాపిట తీసుకుని అందమైన కొప్పును తీర్చిదిద్దుకుంది. కనులకు షిమ్మరీ ఐలిడ్స్, వింగెడ్ ఐలైనర్ ను పెట్టుకుని చీక్స్‌ను హైలెట్ చేసుకుంది పెదాలకు న్యూడ్ పింక్ లిప్‌స్టిక్ పెట్టుకుని తన గ్లామరస్ లుక్స్‌తో యూత్‌ను పరేషాన్ చేసింది.

శార్వరీ వాఘ్ సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన విషయాలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది ఈ బ్యూటీ. ఏ ఫోటో షూట్ చేసినా ఆ పిక్స్‌ను తప్పనిసరిగా ఇన్‌స్టాలో షేర్ చేసి నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ మధ్యనే ఓ అద్భుతమైన బ్లాక్ అవుట్‌ఫిట్ వేసుకుని ఫ్యాషన్ ప్రియుల మనసు దోచేసింది. ఈ కటౌట్ డ్రెస్‌తో కత్తిగా కనిపిస్తూ యూత్‌కు కిక్కిచ్చింది.

ఈ మధ్యనే శార్వరీ వాఘ్ ఓ ఫోటో షూట్ కోసం బ్లూ కలర్ సీక్విన్డ్ అవుట్‌ఫిట్‌ను వేసుకుని కుర్రాళ్ల మనసు దోచేసింది. ఈ ఆఫ్ షోల్డర్, థై హై స్లిట్ అవుట్‌ఫిట్‌లో ఎంతో హాట్ గా కనిపించింది శార్వరి. ఈ పిక్స్ కూడా ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అయ్యాయి.
