Sharvari Wagh : శార్వరీ వాఘ్ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. ఈ బ్యూటీ తన ఫ్యాన్స్ కోసం రోజూ లేటెస్ట్ ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తూనే ఉంటుంది. శీతాకాలంలో వెచ్చనైన అవుట్ ఫిట్స్ ను వేసుకోవాలనుకున్నా , పండుగ సాయంత్రాలలో అద్భుతమైన ఎత్నిక్ దుస్తులు ధరించే వరకు శార్వరి ఫ్యాషన్ డైరీలు ఫ్యాషన్ ప్రియులకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తాయి అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ బ్యూటీ ఇటీవల ఫ్యాషన్ ఫోటోషూట్‌ల నుండి కొన్ని చిత్రాలను తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ తో పంచుకుంది. ఫ్యాషన్ ప్రియుల
హృదయాలను మరోసారి దోచేసింది.

శార్వరీ వాఘ్ ఫ్యాషన్ డిజైనర్ హౌస్ రూమ్ 24కి మ్యూజ్ గా వ్యవహరించింది. ఈ చిత్రాల కోసం బ్లాక్ బాడీకాన్ గౌనును ఎంచుకుంది. తన హాట్ లుక్స్ తో కుర్రాళ్ళ మనసు దోచేసింది. వన్-షోల్డర్ స్లీవ్, ఫుల్ స్లీవ్ లు , ఆపై బ్యాక్‌లెస్ డీటెయిల్స్ తో పాటు థై -బేరింగ్ వివరాలతో క్యాస్కేడ్ చేయబడిన బ్లాక్ బాడీకాన్ గౌనులో శార్వారి ఫిగేర్ పర్ఫెక్ట్ గా కనిపించింది.

తొడ ఎత్తైన చీలికతో, శార్వరి గౌను ఆమె ఆకారాన్ని కౌగిలించుకుంది , ఆమె ఒంపు సొంపులను చక్కగా చూపింది. క్రిస్టియన్ లౌబౌటిన్ నుండి ఎన్నుకున్న నలుపు రంగు హీల్స్ ను పాదాలకు వేసుకుంది. తన లుక్ ను సింపుల్ ఆక్సస్సోరీస్ తో గ్లామరస్ గా మార్చుకుంది. ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన తన చిత్రాలకు శార్వరి క్యాప్షన్ ను జోడించింది. ఇండస్ట్రీ లో ని కో స్టార్ తారా సుతారియా ఈ పిక్స్ కు చాలా అందంగా ఉన్నావంటూ బెస్ట్ కామెంట్ చేసింది.

ఫ్యాషన్ స్టైలిస్ట్ మేనకా హరి సింఘానీ శార్వరీ వాఘ్ కు స్టైలిష్ లుక్స్ ను అందించింది. షార్వరీ మధ్య పాపిట తీసుకుని తన జుట్టును లూస్ గా వదులుకుంది. మేకప్ ఆర్టిస్ట్ నిక్కీ రజనీ సహాయంతో, శార్వరి తన అందానికి మెరుగులు దిద్దుకుంది. కనులకు న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, మాస్కరాతో నిండిన కనురెప్పలతో పాటు పేదలకు న్యూడ్ లిప్‌స్టిక్ దిద్దుకుని తన గ్లామ్ లుక్స్ తో మేస్మెరిసె చేసింది.
