Sharvari Wagh : బాలీవుడ్ బ్యూటీ శార్వరీ వాఘ్ ఫ్యాషన్ సెన్స్ ఎప్పుడూ స్పెషల్ గానే ఉంటుంది. ఓ వైపు స్టైలిష్‌గా కనిపిస్తూనే మరోవైప్ సౌకర్యవంతంగా ఉండే దుస్తులను ధరిస్తూ ఫ్యాషన్ ప్రియులకు ఎప్పటికప్పుడు ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తుంటుంది. ఫ్యాన్స్ మనసు దోచేయడంతో పాటు ఫ్యాషన్ బార్‌లో హై లెవెల్‌ను ఎలా సెట్ చేయాలో శార్వరీకి బాగా తెలుసు. లేటెస్ట్‌గా చేసిన ఓ ఫోటో షూట్‌లోని పిక్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి డేట్ నైట్ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తోంది. ప్రస్తుతం ఈ హాట్ పిక్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

Sharvari Wagh : ఫ్యాషన్ డిజైనర్ హౌజ్ రన్‌అవేకు మ్యూస్‌గా వ్యవహరించింది శార్వరీ. ఈ డిజైనర్ హౌజ్ షెల్ఫ్ నుంచి ఫోటో షూట్ కోసం స్టన్నింగ్ బ్లాక్ గౌన్‌ను ఎన్నుకుంది. స్లిప్ ఇన్ డీటైల్స్‌తో వచ్చిన బ్లాక్ కలర్ సాటిన్ బాడీకాన్ గౌన్ తో కెమెరాకు విభిన్న పోజులు ఇచ్చి మంత్రముగ్ధులను చేసింది. గౌను రెండు సైడ్స్‌లో వచ్చిన కట్ అవుట్ డీటైల్స్ శార్వరీకి స్పెషల్ లుక్‌ను అందించాయి. ఇక టైట్ ఫింటింగ్ శార్వరి షేప్స్‌ను పర్ఫెక్ట్‌గా చూపిస్తోంది. యాంకిల్స్ దగ్గర వచ్చిన ఫ్లేర్డ్ ప్యాట్రన్స్ అవుట్‌ఫిట్ కు మరింత స్టైలిష్ లుక్ ను అందించింది.

ఈ అవుట్‌ఫిట్‌కు సరిగ్గా సూట్ అయ్యేలా చెవులకు గోల్డెన్ ఇయర్ స్టడ్స్‌ను, చేతికి బంగారు గాజులు, చేతి వేళ్లకు గోల్డెన్ రింగ్స్ పెట్టుకుంది. ఇక పాదాలకు క్రిస్టియన్ లౌబౌటిన్ షెల్ఫ్ నుంచి సేకరించిన నలుపు రంగు షూస్ వేసుకుని తన లుక్‌ను మరింత వైబ్రంట్‌గా తీర్చిదిద్దుకుంది శార్వరీ.

ఫ్యాషన్ స్టైలిస్ట్ చాందినీ వాభీ శార్వరీకి స్టైలిష్ లుక్స్‌ను అందించింది. తన కురులతో మధ్యపాపిట తీసుకుని లూజ్‌గా వదులకుని కెమెరాకు విభిన్న భంగిమల్లో పోజులు ఇచ్చి కుర్రాళ్ల మతులు పోగొట్టింది. మేకప్ ఆర్టిస్ట్ నిక్కీ రజానీ శార్వరీ అందానికి మెరుగులు దిద్దింది. కనులకు న్యూడ్ ఐ ష్యాడో, వింగెడ్ ఐ లైనర్, మస్కరా దిద్దుకుని పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్ పెట్టుకుని కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ చిన్నది.

ఓ వైపు బాలీవుడ్ మూవీస్‌లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో తనదైన ఫ్యాషన్ స్టైల్స్‌తో ఫాలోవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది శార్వరీ వాఘ్. ఎప్పటికప్పుడు అప్‌డేటెట్ అవుట్‌ఫిట్స్‌ను హాట్ ఫోటో షూట్ ల ద్వారా ప్రదర్శిస్తూ అందరిని మంత్రముగ్ధులను చేస్తోంది.
