Shardhul Thakur: టీమిండియాకు చెందిన ఒక్కో ప్లేయర్ గాయాల బారిన పడుతూ T20 వరల్డ్ కప్ 2022 ముందు జట్టును సందిగ్ధంలో పడేస్తున్నారు. గాయం కారణంగా టీ20 ప్రపంచకప్ కు దీపక్ చాహర్ దూరమయ్యాడు. ఇలా అనుకోకుండా ఆస్ట్రేలియా వెళ్లే ఆటగాళ్ల లిస్ట్ నుండి చాహర్ దూరం అవడం నిజంగా బాధాకరమే.. అయితే ప్రస్తుతానికి దీపక్ చాహర్ స్థానాన్ని భర్తీ చేయడానికి శార్దూల్ ఠాకూర్ ని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. దీంతో శార్దూల్ భారత జట్టులో స్టాండ్-బై ప్లేయర్‌గా ఉండనున్నాడు.
ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ పూర్తైన తర్వాత శార్దూల్ ఠాకూర్ ముంబై చేరుకోగా.. ముంబై ఎయిర్ పోర్ట్ లో అతడు సమస్య ఎదుర్కోవాల్సి వచ్చింది. అక్కడ ముంబై ఎయిర్‌పోర్ట్ టెర్మినల్-2 నుంచి శార్దూల్ బ్యాగ్ మాయమైంది. ఇందుకు ఒకింత అసహనానికి గురయ్యాడు ఈ స్టార్ ప్లేయర్. అంతేకాక ఆ ఎయిర్ పోర్ట్ సిబ్బంది నిర్వాకం అతన్ని నిరుత్సాహానికి గురి చేసింది. దీంతో కిట్ బ్యాగ్‌లు అందించాలని ఎయిర్‌పోర్టు అథారిటీకి సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశాడు. వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరాడు. అయితే ఇక్కడ గమ్మత్తేమిటంటే శార్దూల్ ట్వీట్ కి మాజీ క్రికెటర్ హార్భజన్ సింగ్ క్షమాపణ చెప్పాడు. అంతే కాదు శార్దూల్ సమస్యను వెంటనే పరిష్కరించేలా చేశాడు కూడా.
శార్దుల్.. “లగేజ్ బెల్ట్ వద్దకు ఎవరినైనా సాయంగా పంపిస్తారా..? నా కిట్ బ్యాగులు సమయానికి రాకపోవడం ఇదేమీ మొదటి సారి కాదు. అక్కడ సిబ్బంది ఎవరూ లేరు ” అని పోస్టు పెట్టాడు. తాను వచ్చిన టెర్మినల్ కూడా మెన్షన్ చేశాడు. ఆ ట్వీట్ కు భజ్జి రిప్లై ఇస్తూ “మై డియర్.. త్వరగానే మీ సమస్యను పరిష్కరిస్తాం. మా సిబ్బంది తప్పక సాయం అందిస్తారు. మీకు కలిగిన ఇబ్బందికి చింతిస్తున్నాం. వుయ్ లవ్ యూ” అని ఆఫీషియల్ స్టైల్ లో రిప్లై ఇచ్చాడు. అయితే భజ్జీ రిప్లైతో వెంటనే శార్దూల్ ఠాకూర్ కు సహాయం అందింది.
ఆ తర్వాత శార్దూల్ ‘భజ్జీ లవ్ యూ టూ.. విమాన సంస్థ సిబ్బంది నుంచి సాయం అందింది’ అని ట్వీటాడు.
Shardhul Thakur:
విచిత్రం ఏమిటంటే భజ్జి మాజీ ఎయిరిండియా ఉద్యోగి. రిటైర్ అయినా తనదైన శైలిలో రిప్లై ఇచ్చి.. అందర్నీ ఆశ్చర్యపరిచాడు హర్భజన్. ఈ సందర్భంగా రిటైర్డ్ అయినా ఇంకా ఆన్ డ్యూటీలోనే ఉన్నదంటూ కొందరు తమ భావాలు కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు. మొత్తానికి దీపక్ చాహర్ రూపంలో జట్టుకు షాక్ తగిలినా.. దక్షిణాఫ్రికాతో సిరీస్ లో అయితే ఠాకూర్ అద్భుత ప్రదర్శనే చేశాడు. దీనితో అతడు కూడా జట్టుకు బలమేనని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.