పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ సీక్వెల్ సర్దార్ గబ్బర్ భారీ హైప్ మధ్య రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులకి చేరువ కాలేదు. కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని దృష్టిలో ఉంచుకొని వారిని ఎంటర్టైన్ చేయడం కోసమే ఈ మూవీ తీసినట్లు అందరికి అనిపించింది. స్టోరీ లైన్ బాగున్నా, దానిని డీల్ చేసే విధానం అంత పెర్ఫెక్ట్ గా లేదనే విమర్శలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఈ మూవీలో వేలు పెట్టాడని అందుకే ఫ్లాప్ అయ్యిందని యాంటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రచారం చేశారు. నిజానికి సర్దార్ గబ్బర్ సింగ్ స్టోరీ పవన్ కళ్యాణ్ రాసిందే. దానిని బాబీ చేతిలో పెట్టారు.
అయితే ఫ్యాన్స్ హై ఎక్స్ పెక్టేషన్స్ ని అతను రీచ్ కాలేకపోయాడు. ఇదిలా ఉంటే ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ ని విలన్ గా బాలీవుడ్ నటుడు శరద్ కేల్కర్ నటించాడు. అతనికి ప్రభాస్ కి ఓ సంబంధం ఉంది. బాహుబలి సినిమా హిందీ వెర్షన్ లో ప్రభాస్ కి డబ్బింగ్ చెప్పింది శరద్ కేల్కర్. అతని స్వరం కూడా బాలీవుడ్ లో ప్రభాస్ ఇమేజ్ పెరగడానికి కారణం అయ్యింది. ఆ తరువాత సాహో, రాధేశ్యామ్ చిత్రాలకి శరద్ కేల్కర్ ప్రభాస్ కి వాయిస్ ఇవ్వలేదు. రాధేశ్యామ్ సినిమాలో సొంతగా హిందీ డబ్బింగ్ చెప్పాడు.
ఆ వాయిస్ నార్త్ ఆడియన్స్ కి రీచ్ కాలేదు. ఇక తాజాగా వచ్చిన ఆదిపురుష్ టీజర్ లో ప్రభాస్ కి రాముడిగా గొంతు ఇచ్చింది శరద్ కేల్కర్ కావడంతో ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయ్యింది. అతని వాయిస్ కి బాలీవుడ్ లో బాగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ నేపధ్యంలో ఆదిపురుష్ లో ప్రభాస్ పాత్రకి హిందీలో శరద్ కేల్కర్ డబ్బింగ్ చెబుతూ ఉండటంతో కచ్చితంగా బాహుబలి రేంజ్ లో ఈ మూవీ హిట్ అవుతుందనే టాక్ వినిపిస్తుంది. శరద్ కేల్కర్ వాయిస్ ఆదిపురుష్ లో శ్రీరాముడి పాత్రకి పెర్ఫెక్షన్ తీసుకొస్తుందని భావిస్తున్నారు. ఇక తాజా టీజర్ లో కూడా ప్రభాస్ నోటి నుంచి వచ్చే డైలాగ్స్ గూస్ బాంబ్స్ గా ఉన్నాయని హిందీ ఆడియన్స్ అంటున్నారు. దానికి కారణం ప్రభాస్ కి వాయిస్ ఇచ్చిన శరద్ కేల్కర్ ది అని చెప్పాలి.