Shanmukh : యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ సీజన్ 5 రన్నరప్ షణ్ముఖ్ జశ్వంత్ ఖరీదైన బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేశాడు. బిగ్‌బాస్‌కి వెళ్లడానికి ముందే రూ.20 లక్షలు వెచ్చించి ఎంజీ హెక్టార్ కారును కొన్న షణ్ను తాజాగా దానికి డబుల్ కంటే కాస్త ఎక్కువే విలువైన బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేశాడు. దాని విలువ సుమారు రూ.52 లక్షలు కావడం గమనార్హం. విజయ దశమి సందర్భంగా అటు ప్రముఖ యాంకర్, నటుడు బిత్తిరి సత్తి రేంజ్ రోవర్ కారు కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే షణ్ముఖ్ తన అన్న, తల్లిదండ్రులతో కలిసి వెళ్లి బ్లూ కలర్ బీఎండబ్ల్యూ కారును డెలివరీ తీసుకున్నారు.
షోరూంలో నుంచి కారును షణ్ను తండ్రి అప్పారావు డ్రైవ్ చేసుకొచ్చి కుమారుడికి కారును అందజేశారు. దీనికి సంబంధించిన వీడియోను అభిమానులతో షణ్ను తన అభిమానులతో పంచుకున్నాడు. తన అభిమానులకు ఆసక్తికర పోస్టును పెట్టాడు. మొత్తానికి తన కల నెరవేరిందని.. తన కుటుంబం తర్వాత తనను చాలా గొప్ప స్థానంలో చూడాలనుకున్నది అభిమానులేనన్నాడు. ఈ కారు మనదని.. ఎప్పుడు కనిపించినా చెప్పాలని లిఫ్ట్ పక్కా అని అభిమానులకు భరోసా ఇచ్చాడు. బీఎండబ్ల్యూ కారుకు ఓనర్ అయిన షణ్ముఖ్‌ను ఆయన సెలబ్రిటీ ఫ్రెండ్స్‌తో పాటు అభిమానులు అభినందిస్తున్నారు.
యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన షణ్ముఖ్‌కు బిగ్‌బాస్ సీజన్5లో అవకాశం వచ్చింది. ఈ సీజన్‌లో షణ్ను రన్నరప్‌గా నిలిచాడు. నిజానికి విన్నర్‌గానే గెలవాల్సింది అయితే సిరి హన్మంతుతో క్లోజ్‌నెస్ మెయిన్‌టైన్ చేసి కావల్సినంత నెగిటివిటీని తెచ్చుకున్నాడు. తామిద్దరికీ కనెక్షన్ వచ్చిందని చెప్పి సిరి సైతం కావల్సినంత బ్యాడ్ ఇమేజ్‌ను తెచ్చుకుంది. వీరిద్దరి కనెక్షన్‌తో షణ్నుని ఎంతగానో ప్రేమించిన దీప్తి సునయన అతను బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే బ్రేకప్ చెప్పేసింది. ఇక ఆ తరువాత మళ్లీ షార్ట్ ఫిలింస్‌పై దృష్టి పెట్టాడు. ఇటీవల అతను నటించిన ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ అనే వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది.