సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో ఓ వైపు ఆర్.సీ 15 మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇదే సమయంలో కమల్ హసన్ తో ఇండియన్ 2 మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కుతున్న సినిమాలే కావడం విశేషం. ఇండియన్ 2 మూవీ ఎప్పుడో ప్రారంభం అయిన చాలా అవాంతరాలు మధ్యలో వచ్చాయి. దీంతో సినిమా ఆగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు సమస్యలు అన్ని పరిష్కారం అయిపోవడంతో సినిమాని పూర్తి చేసే పనిలో శంకర్ పడ్డాడు. అదే సమయంలో రామ్ చరణ్ మూవీ కూడా ఫినిష్ చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాల తర్వాత శంకర్ మరో భారీ ప్రాజెక్ట్ ని టేకప్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు రానటువంటి కథాంశంతో హిస్టోరికల్ ఫోక్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ సినిమా ఉండబోతుందని టాక్. ప్రముఖ రచయిత ఎస్. వెంకటేశ్ చారిత్రక నేపథ్యంలో రాసిన నేర్పాలి అనే నవల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించడానికి శంకర్ సిద్ధం అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ నవలకి సంబందించిన కాపీ రైట్ హక్కులని కూడా బడా నిర్మాత కొనుగోలు చేసాడని సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్ ని కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా ఏకంగా వెయ్యి కోట్ల బడ్జెట్ తో పలు పార్ట్స్ క్రింద ఆవిష్కరించే ప్రయత్నంలో ఉన్నారనే సమాచారం కోలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఇక వేళ అదే నిజమైతే ఇండియన్ ఇండస్ట్రీలో వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మొట్టమొదటి చిత్రంగా ఈ మూవీ నిలిచే అవకాశం ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.