Shani : బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన షానీ సల్మాన్ ఆ షోకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. హౌస్ మొత్తం ఫుల్ ఫైర్ మీదుంది. కెప్టెన్సీ టాస్కుతో ఇంట్లోని సభ్యులు రెండు గ్రూపులుగా మారిపోయి కొట్టేసుకుంటున్నారు. టాస్కులు, కొట్లాటలు మాత్రమే కాదు.. బిగ్ బాస్ హౌస్‌లో హగ్గులు, కిస్సులు ఉంటాయని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా గత సీజన్లో షణ్ముఖ్ జశ్వంత్- సిరి హన్మంత్ల గురించి మాత్రం బాగా కాంట్రవర్సీలు కావడం చూశాం. వారిద్దరూ హద్దులు దాటడం.. దీంతో షణ్ముక్ రిలేషన్ కూడా బ్రేక్ అయ్యింది.
అయితే ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లోనూ అలాంటి జంట ఒకటి కాదు.. రెండు ఉన్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు. వాళ్లు మరెవరో కాదు.. ఆర్జే సూర్య– ఆరోహీ రావు అలాగే శ్రీ సత్య, అర్జున్. అయితే శ్రీసత్య, అర్జున్‌ల గురించి పక్కనబెడితే.. సూర్య, ఆరోహిలు మూడేళ్లుగా మంచి ఫ్రెండ్స్ అని చెబుతున్నారు. వాళ్ల మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందని, ఒకరికి ఒకరు మంచి సపోర్ట్ ఇచ్చుకుంటూ ఉంటామని చెబుతున్నారు. అయితే వాళ్ల పనులు మాత్రం ప్రేక్షకులకు మరోలా అర్ధమవుతున్నాయి. వారి మధ్య సంథింగ్ ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. రెండోవారం వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున కూడా ఇదే విషయాన్ని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పిన విషయం తెలిసిందే.
Shani : ప్రతిదీ లస్ట్తో కూడిన లవ్ అనుకోకూడదు..
అంతేకాకుండా హౌస్‌లో ఆరోహీ రావ్– సూర్యల మధ్య హగ్గులు, కిస్సులు కూడా నడుస్తున్నాయంటూ ప్రచారాలు జరుగుతున్నాయి. ఆరోహీ- రేవంత్‌తో గొడవ పడిన తర్వాత ఆరోహీ వెళ్లి కూర్చొని ఏడుస్తున్న సమయంలో సూర్య ఓదార్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమెకు నుదుటిపై ముద్దు పెట్టి హత్తుకుని ఓదార్చాడు. ఇలా పలు సందర్భాల్లో జరిగాయి కూడా. గత శనివారం ఎపిసోడ్లో సూర్య దిగాలుగా బాత్రూమ్కి వెళ్లగా.. వెనకాలో ఆరోహీ కూడా వెళ్లింది. అతడికి ధైర్యం చెప్పింది. ఆ తర్వాత సూర్య- ఆరోహీని గట్టిగా హత్తుకున్నాడు. ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో షానీ సాల్మన్ స్పందించాడు. “నారాయణ గారు చెప్పినట్లు అక్కడ ఏం జరగదు. హౌస్‌లో 70 కెమెరాలు ఉన్నాయి. ఏ ఇద్దరు ఓ మూలన ఉన్నా కెమెరాకు కనిపిస్తుంది. చిన్న శబ్ధం అయినా రికార్డ్ అవుతుంది. ఎవరైనా ఒకరిని హగ్ చేసుకున్నారు అంటే వారి మధ్య ప్రేమే ఉందని చెప్పలేం. ఒక్కోసారి ప్రశంసించే సందర్భంలో ముద్దు కూడా పెడతారు. వాళ్లిద్దరూ క్లోజ్ అనే మాట వాస్తవం. ప్రతిదీ లస్ట్తో కూడిన లవ్ అనుకోకూడదు. నేను ఇలాంటివి చేయలేదు కాబట్టే బయట ఉన్నాను” అంటూ షానీ సాల్మన్ క్లారిటీ ఇచ్చాడు.