Shanaya Kapoor : సంజయ్ కపూర్ , మహీప్ కపూర్ ల గారాల పట్టి షనాయా కపూర్ కూల్ అవుట్ ఫిట్ లో క్రేజీ లుక్ లో కనిపిస్తూ కవ్విస్తోంది. బాలీవుడ్ లో బిగ్ స్క్రీన్ పై ఇంకా అడుగు పెట్టకముందే ఈ బ్యూటీ కి సోషల్ మీడియా లో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం బేదఢక్ చిత్రంతో వెండితెరపై అడుగు పెట్టబోతోంది షనాయా కపూర్. తాజాగా అందమైన గులాబీ రంగు పోల్కా చుక్కల డ్రెస్ ను ధరించి హాట్ ఫోటో షూట్ చేసి అందరిని మెస్మెరైజ్ చేసింది షనాయా.

Shanaya Kapoor : షనాయా కపూర్ బాత్‌టబ్‌పైకి ఎక్కి, ఒక చేతిలో ఫోన్, మరో చేతిని స్తంభంపై ఉంచి పోజులిస్తూ మిర్రర్ సెల్ఫీలను దిగింది. షనాయా వాష్ రూమ్ లోని ప్రతి మూలాన్ని తన ఫొటోల్లో చూపించింది. పోల్కా డాట్స్ డ్రెస్ లో పర్ఫెక్ట్ పిక్చర్ వచ్చేలా ఫోటో షూట్ చేసింది ఈ సుందరి. వాష్రూమ్ లో చేసిన ఈ ఫోటో షూట్ పిక్స్ ను షనాయా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్ .

షనాయా కపూర్ మల్టీ-లేయర్డ్ ఫ్రిల్స్ తో వచ్చిన అందమైన పింక్ స్ట్రాప్‌లెస్ పోల్కా-డాటెడ్ ఆర్గాంజా డ్రెస్‌లో యువరాణిలా కనిపిస్తోంది. ఒకచోట వితౌట్ జ్యువెల్లరీ మరోచోట విత్ జ్యువెల్లరీ తో ఫోటోలు దిగి అదరగొడుతోంది.

మెడలో గ్రీన్ కలర్ జెమ్ స్టోన్స్ తో వచ్చిన చోకర్ నెక్లెస్ వేసుకుని, చేతికి డిజైనర్ బ్రాస్లెట్ పెట్టుకుంది. చేతి వేళ్ళకు వజ్రాలతో పొదిగిన ఉంగరాన్ని , చెవులకు స్టడ్స్ అలంకరించుకుని హొయలు పోయింది.

మోడరన్ దుస్తుల్లో మెరవడమే కాదు ఎత్నిక్ అవుట్ ఫిట్స్ లోనూ అదరగొట్టగలదు షనాయా కపూర్. ఈ బ్యూటీ ఈ మధ్యనే అందమైన లెహెంగా సెట్ ధరించి కుర్రాళ్లకు చెమటలు పట్టించింది. లేత పెసరు రంగు లో వచ్చిన లెహెంగా సెట్ లో మతులు పోగొట్టింది.

ప్రముఖ బాలీవుడ్ ఫేవరెట్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఈ ఎత్నిక్ అవుట్ ఫిట్ లో ఎంతో అందంగా కనిపించింది.
