Shanaya Kapoor : బాలీవుడ్ సెలబ్రిటీలు మహీప్ కపూర్ , సంజయ్ కపూర్ ల కుమార్తె, షనాయ కపూర్, ఇన్‌స్టాగ్రామ్‌లో సిజ్లింగ్ పిక్స్ ను పోస్ట్ చేసి బోల్డ్ లుక్‌తో ఇంటర్నెట్ లో మంటలు రేపుతోంది. త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్న షనాయ కపూర్ ఈ హాట్ ఫోటోషూట్ కోసం డెనిమ్ ఆన్ డెనిమ్ అవుట్ ఫిట్ ను ధరించింది. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియా లో సునామీని సృష్టిస్తున్నాయి చొక్కా విప్పి మరీ అందాలను చూపిస్తూ కుర్రాళ్ళను రెచ్చగొడుతోంది.

Shanaya Kapoor : షనాయ కపూర్ హాట్ పిక్స్ కు బెస్ట్ ఫ్రెండ్ అనన్య పాండే , కజిన్ సోదరి ఖుషీ కపూర్‌తో సహా నెటిజన్లు హార్ట్ సింబల్స్ ను ఇన్ బాక్స్ లో పోస్ట్ చేసారు. షానాయ బోల్డ్ అవతార్‌ను ప్రశంసలతో ముంచెత్తారు ఆమె ఫాలోవర్స్.

షనాయ కపూర్ కొత్త ఫోటోషూట్ నుండి చిత్రాలను ఇన్ స్టాలో పంచుకుని “సుప్ప్ప్” అని క్యాప్షన్ ను జోడించింది. దానితో పాటే మేకప్ ఆర్టిస్ట్ రిధిమా శర్మ హెయిర్ స్టైలిస్ట్ అమిత్ ఠాకూర్‌లను కూడా ట్యాగ్ చేసింది.

డెనిమ్-ఆన్-డెనిమ్ దుస్తులను ధరించి కెమెరా కోసం షనాయ అద్భుతమైన భంగిమలను అందించింది.ఈ అవుట్ ఇట్ ను షనాయా కపూర్ లగ్జరీ క్లాతింగ్ లేబుల్ బాలెన్సియాగా షెల్ఫ్ నుంచి సేకరించినది. షనాయ షూట్ కోసం షర్టు లేకుండానే ఫోటో షూట్ చేసింది.

షనాయ డ్రెప్డ్ ఓవర్‌సైజ్ డెనిమ్ జాకెట్ కు మ్యాచింగ్ లైట్ బ్లూ డెనిమ్ జీన్స్‌తో జత చేసింది. ఆమె అందాల డోస్ ను మరింత పెంచేందుకు ప్యాంటును నడుము వద్ద మడిచింది. చివరగా, తన కురులను లూస్ గా వదులుకుని కనురెప్పలపై మాస్కరా, పెదాలకు నిగనిగలాడే న్యూడ్ లిప్ షేడ్, పెట్టుకుని గ్లామ్ లుక్ ను పూర్తి చేసింది. యాక్సెసరీస్ ఏవీ లేకుండానే షనాయ మేకప్‌కి ఫినిషింగ్ టచ్ ఇచ్చి తన గ్లామర్ షో తో అందరిని కట్టి పడేసింది.

షనాయ కపూర్ బేధడక్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. లక్ష్య లాల్వానీ , గుర్ఫతే పిర్జాదా నటించిన ఈ చిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు. త్వరలో ఈ మూవీ తెరమీదకు రానుంది అంతలోనే ఫ్యాన్స్ ఫాలోవింగ్ ను పెంచుకునేందుకు ఈ భామ సోషల్ మీడియా ను వేదికగా చేసుకుంది.