సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా మైథలాజికల్ పాయింట్ తో ప్రేమకథా చిత్రంగా ఈ మూవీని దర్శకుడు గుణశేఖర్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. మహాభారతంలో ఆదిపర్వంలో శాకుంతల దుష్యంతుడి ప్రేమకథ ఉంటుంది. అయితే అందులో పెద్ద వర్ణన ఉండదు. అయితే గుణశేఖర్ ఎంతో వర్క్ చేసి అద్భుతమైన దృశ్య కావ్యంగా ఈ మూవీని వెండితెరపై ఆవిష్కరించారు. ఫిబ్రవరి 14న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. గుణశేఖర్, దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.
ఇక ఈ మూవీ సమంత దృక్కోణం నుంచి కథని దర్శకుడు గుణశేఖర్ నేరేట్ చేసినట్లు కనిపిస్తుంది. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ తో అప్పటి కాలాన్ని పరిచయం చేస్తూ నిజంగానే మహాభారత కాలంలో ప్రకృతి ఇంత అద్బుతంగా ఉండేదా అనే విధంగా అద్బుతమైన దృశ్యాలని విజువల్ గ్రాండియర్ గా గుణశేఖర్ ట్రైలర్ ని ఆవిష్కరించారు. అలాగే సమంతని ఒక దేవకన్యలా తెరపై చూపించిన విధానం కూడా అద్బుతంగా ఉంది. ఇక శాకుంతల, దుష్యంతుడి ప్రేమతో పాటు, ఆమె విరహవేదన, శాపం, దుష్యంతుడి కొలువులో అవమానాలని ఎదుర్కొన్న విధానం తెరపై చూపించి కథాబలం ఉన్న సినిమాగా శాకుంతలం మూవీ ఉండబోతుందని చెప్పకనే చెప్పారు.
గ్రాఫిక్స్ వర్క్ అంతగా మెప్పించే విధంగా లేకపోయిన బలమైన కథ, కథనాలతో శాకుంతలం సినిమాని గుణశేఖర్ ఆవిష్కరించినట్లు తెలుస్తుంది. ఇక మణిశర్మ సంగీతం కూడా క్లాసిక్ గా కథని నడిపించే విధంగా ఉండటం విశేషం. ఇదిలా ఉంటే ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో సమంత సినిమా గురించి, తన గురించి చెబుతూ కాస్తా భావోద్వేగానికి గురైంది. చాలా ఓపిక తెచ్చుకొని ప్రేక్షకులని కలవాలని ఈ ఈవెంట్ కి రావడం జరిగిందని సమంత చెప్పుకొచ్చింది. తనని తమ్మి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు గుణశేఖర్ కి కృతజ్ఞతలు తెలియజేసింది.