గుణశేఖర్ దర్శకత్వంలో దిల్ రాజు సమర్పణలో సమంత లీడ్ రోల్ లో శాకుంతలం మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. ఇదిలా ఉంటే ఈ మూవీని నవంబర్ 4న రిలీజ్ చేయబోతున్నట్లు ఆ మధ్య ప్రకటించారు. అయితే గుణశేఖర్ మరల రిలీజ్ డేట్ విషయంలో వెనక్కి తగ్గారు. శాకుంతలం మహాభారత కాలం నాటి దృశ్యకావ్యం కావడంతో సిల్వర్ స్క్రీన్ పై గ్రాండియర్ గా ఆవిష్కరిస్తేనే బాగుంటుందని భావించినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో ఈ మూవీని త్రీడీ వెర్షన్ లో తీసుకురావడానికి రెడీ అయ్యారు. దీంతో నవంబర్ 4 అనుకున్న రిలీజ్ డేట్ వాయిదా వేశారు.
తాజాగా మరోసారి ఈ మూవీకి సంబందించిన అప్డేట్ ని ట్విట్టర్ లో ప్రకటించారు. శాకుంతలం దృశ్యకావ్యాన్ని ప్రేక్షకులకి మరింత రీచ్ అయ్యే విధంగా చేరువ చేయడానికి త్రీడీ వెర్షన్ లో తీసుకురాబోతున్నామని చెప్పారు. ఈ కారణంగా రిలీజ్ డేట్ మరింత ఆలస్యం అవుతుందని, త్వరలోనే సినిమాకి సంబంధించి డేట్ ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తామని పోస్టర్ తో క్లారిటీ ఇచ్చారు. శాకుంతలం మూవీ సమంతకి కూడా చాలా ప్రెస్టీజ్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. సోలోగా పాన్ ఇండియా స్థాయిలో నటిగా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఈ మూవీ ఆమెకి గొప్ప అవకాశం.
దీంతో సమంత కూడా శాకుంతలం సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఇక రానాతో తీయబోయే హిరణ్యకశిప చిత్రానికి శాకుంతలం మూవీ ఒక రూట్ మ్యాప్ గా గుణశేఖర్ భావిస్తున్నారు. దీంతో ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన సొంత ప్రొడక్షన్ లోనే తెరకెక్కిస్తున్నారు. ఇక మలయాళీ యాక్టర్ దేవ్ పటేల్ ని ఈ మూవీలో దుశ్యంతుడి పాత్రలో చూపించబోతున్నారు. దీనిని బట్టి కథని శాకుంతలం దృక్కోణం నుంచి ఆమె లైఫ్ స్టోరీగానే గుణశేఖర్ రిప్రజెంట్ చేశాడని అర్ధమవుతుంది.