Sayani Gupta : రెడ్ కార్పెట్ ఫ్యాషన్ అనేది బాలీవుడ్ స్ట్రాంగెస్ట్ సూట్ . ప్రతి రోజు ఏదో ఒక ఫ్యాషన్ వీక్ బాలీవుడ్ లో జరుగుతూనే ఉంటుంది. కానీ ఫ్యాషన్ అనే సముద్రంలో ఎప్పుడూ ఊహించని విధంగా క్లాసిక్ అవుట్‌ఫిట్ ఫ్యాషన్‌ను ప్రమోట్ చేసే ఫ్యాషన్ వాది లేకపోలేదు. ఈ సారి ఫ్యాషన్ వాది సయానీ గుప్తా తన వెబ్ సీరీస్ ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ ప్రమోషన్‌లో అలాంటి ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తోంది. ఫ్యాషన్ ప్రియుల హృదయాలను దోచేస్తోంది.

నలుపు రంగు దుస్తులు ఎప్పటికీ ఎవర్ గ్రీనే అయితే, సయానీ గుప్తా తన నల్లని దుస్తులతో ఎలివేటెడ్ స్ట్రక్చర్‌ని జోడించి తన లోని దాగి ఉన్న అందాలను తెర తీసి మరి చూపిస్తోంది. అందరి దృష్టి తనపై నుంచి వెళ్లకుండా ఉండేలా చేస్తుంది.

సయానీ గుప్తా వేసుకున్న బ్లాక్ బాడీకాన్ మిడి డ్రెస్‌లో ఎంతో హాట్ గా బోల్డ్ గా కనిపించింది. వెరీ డీప్ స్వీట్‌హార్ట్ నెక్‌లైన్ తో ఫ్రంట్‌లో స్లిట్‌తో వచ్చిన ఈ డ్రెస్‌లో తన ఎద అందాలను స్పష్టంగా చూపిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ బ్లాక్ అవుట్‌ఫిట్‌కు వైట్ కలర్ లో వచ్చిన డ్రమాటిక్ స్లీవ్స్ స్పెషల్ లుక్‌ను తీసుకువచ్చాయి.

ఈ అవుట్‌ఫిట్‌కు మ్యాచ్ అయ్యేలా పాయింటెడ్ బ్లాక్ హీల్స్ వేసుకుంది. మెడలో గోల్డెన్ నెక్లెస్‌తో పాటు చేతి వేళ్లకు మినిమల్ గోల్డ్ టోన్డ్ ఉంగరాలను జత చేసింది. ఆమె చిక్ షార్ట్ బాబ్ స్టైల్ హెయిర్‌తో మోడ్రన్ రెట్రో వైబ్స్‌ను తీసుకువచ్చింది ఈ బ్యూటీ. ఈ అందమైన అవుట్‌ఫిట్‌ను రితి రాహుల్ షా ఫ్యాషన్ లేబుల్ అయిన వందన ఫ్యాషన్ ఏజెన్సీ నుంచి ఎన్నుకుంది సయానీ . మీషో డిజైన్స్ నుంచి రింగ్స్ ఎన్నుకుంది. శీతల్ మేకప్ టచ్ ఇవ్వగా, శ్రీజా రాజ్ గోపాల్ స్టైలిష్ లుక్స్‌ను అందించాడు.

ఈ అవుట్‌ఫిట్ తో చేసిన ఫోటో షూట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి. సయానీ గుప్తా అందాలపైనే ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఫోర్ మోర్ షాట్స్ అనే వెబ్‌సీరీస్‌లో బోల్డ్ క్యారెక్టర్‌తో అందరిని ఇంప్రెస్స్ చేసింది సయానీ. ఈ సీరీస్‌లో జర్నలిస్ట్ క్యారెక్ట్‌ర్ ను ఎంతో సహజ సిద్ధంగా చేసి ఆమె తన నటనతో యూత్‌కు కనెక్ట్ అయ్యింది. కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నప్పటికీ యూత్‌కు బాగా కనెక్ట్ అయిన సీరీస్ ఇది. నలుగురు అమ్మాయిల మనస్తత్వం వారి జీవన విధానం ,రిలేషన్స్ పైన ఈ సీరీస్ నడుస్తోంది. ప్రస్తుతం మూడో సీరీస్ కూడా ప్రేక్షకులను అలరిస్తోంది.
