మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ అక్టోబర్ 5న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్ యాక్టివిటీస్ ని చిత్ర యూనిట్ స్టార్ట్ చేసింది. అనంతపురంలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం ఏపీలో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ ఈవెంట్ లో వైసీపీ నాయకులు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మెయిన్ విలన్ గా సత్యదేవ్ కనిపించబోతున్నాడు. అతన్ని మెగాస్టార్ చిరంజీవి ఏరికోరి ఎంపిక చేసుకున్నారు.
ఇక తాజాగా గాడ్ ఫాదర్ ప్రమోషన్ లో భాగంగా సత్యదేవ్ ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా అఫర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చిరంజీవి పిలిచి కూర్చోబెట్టి గాడ్ ఫాదర్ సినిమా కథని తనకి నేరేట్ చేశారని, ఆ క్షణం నన్ను నేను నమ్మలేకపోయా అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి తనకి కథ చెప్పడం ఏంటి అని ఒక్క క్షణం అనిపించిందని, ఆ సమయంలో ఆశ్చర్యంతో అలా ఉండిపోయా అని సత్యదేవ్ చెప్పుకొచ్చాడు. చిరంజీవి గారు కథ అంతా చెప్పాక నీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది డైరెక్టర్ తో నేరేషన్ ఏమైనా ఇప్పించాలా అని అడిగారని అన్నాడు.
మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంతోనే నా కల సాకారం అయ్యిందని చెప్పారు. లూసీఫర్ మూవీ చూసావా అని కూడా అన్నయ్య అడిగారని, అప్పటికి ఆ సినిమా ఇంకా చూడలేదని, ఇకపై చూడను అని కూడా చెప్పానని చెప్పారు. ఇప్పటి వరకు తన కెరియర్ లో చేయనటువంటి పవర్ ఫుల్ రోల్ లో గాడ్ ఫాదర్ సినిమాలో తాను కనిపిస్తానని సత్యదేవ్ చెప్పారు. ఈ మూవీ నన్ను మరో ఎత్తుకి తీసుకెళ్తుంది అనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఏది ఏమైనా మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం తక్కువ టైంలోనే దొరకడం నిజంగా తన అదృష్టం అని సత్యదేవ్ చెప్పడం విశేషం.