గాడ్ ఫాదర్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులని భాగా ఆకట్టుకుంటుంది. రీమేక్ కథ అయితే మోహన్ రాజా స్క్రీన్ ప్లేలో చాలా మార్పులు చేశారు. ఇక ఆద్యంతం సినిమా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి ప్రతినాయకుడిగా టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ నటించిన సంగతి తెలిసిందే. ఒరిజినల్ లో వివేక్ ఒబరాయ్ పోషించిన పాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవి పట్టుబట్టి మరీ సత్యదేవ్ ని ఫైనల్ చేశారు. ఇక అతనికి కథ కూడా చిరంజీవి నేరేట్ చేసారనే విషయాన్ని సత్యదేవ్ ప్రమోషన్ లో భాగంగా చెప్పారు.
ఇదిలా ఉంటే చిరంజీవి సత్యదేవ్ ని ఈ సినిమా కోసం ఎందుకు ఎంపిక చేసారనేది సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమాలో మెగాస్టార్ కి సమానమైన పాత్రలో సత్యదేవ్ కనిపించి మెప్పించాడు. ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే కొన్ని సన్నివేశాలలో అయితే మెగాస్టార్ చిరంజీవిని సైతం డామినేట్ చేసి సత్యదేవ్ మెప్పించాడని చెప్పాలి. థియేటర్స్ లో సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి కూడా వీరిద్దరి కాంబోలో వచ్చే సన్నివేశాలకి విజిల్స్ పడుతున్నాయి. ముఖ్యంగా గాడ్ ఫాదర్ టైటిల్ సినిమాకి సత్యదేవ్ ని ఉద్దేశించి పెట్టారని కూడా ఆయన యాక్టింగ్ ని ఇష్టపడే వారు చెప్పే మాట.
క్లైమాక్స్ వరకు సత్యదేవ్, చిరంజీవి మధ్య పోటాపోటీ ఉంటుంది. ఇక అతను కనిపించిన ప్రతి సీన్ లో కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి అందరిని మెస్మరైజ్ చేశాడని చెప్పాలి. అతని యాక్టింగ్ స్కిల్ తెలుసు కాబట్టి మెగాస్టార్ ఏరికోరి సత్యదేవ్ ని గాడ్ ఫాదర్ లో సినిమాకి ఎంపిక చేసారనే మాట వినిపిస్తుంది. గాడ్ ఫాదర్ తో వచ్చిన ఇమేజ్ తో సత్యదేవ్ కి కచ్చితంగా ఫాలోయింగ్ పెరగడంతో పాటు స్టార్ హీరోల చిత్రాలలో పవర్ ఫుల్ విలన్ పాత్రలు వచ్చే అవకాశం ఉందనే టాక్ ఇప్పుడు నడుస్తుంది. ఇప్పటికే హిందీలో అక్షయ్ కుమార్ రామ్ సేతు సినిమాలో కూడా సత్యదేవ్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.