ఎంట్రీ సాంగ్ తో వీకెండ్ ఎపిసోడ్ ను స్టార్ట్ చేసిన నాగార్జున ఇంటి సభ్యులు శుక్రవారం ఏం చేశారో చూడడానికి మన టివిలోకి వెళ్ళిపోయారు.లాస్ట్ ఎపిసోడ్ లో జైలు పాలైన కాజల్ సింపతి గేమ్ ట్రై చేస్తుందని రవి మానస్ తో చెప్పాడు ఈ విషయంపై మానస్,కాజల్ మధ్య డిస్కషన్ జరిగింది.ఇక శ్రీరామ్ చంద్రా తన కెప్టెన్సీ బైయిస్ గా ఉందా అని అడిగినప్పుడు జెస్సీ,సిరి, షణ్ముఖ్ తప్ప ఎవరూ చేయి లేవలేదు.దీనిపై జెస్సీ ఇంట్లో వారంతా హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారని నోరు జారాడు.ఇక ఈవారం ఇంటి నుండి తాను బయటికి వెళ్తానని బాధపడుతున్న జెస్సీని అలాంటిదేమీ జరగదు భయపడకు అంటూ సిరి, షణ్ముఖ్ ఓదార్చారు.
ఇక ఇంట్లో జరిగిన డిస్టర్బెన్స్ కు పుల్ స్టాప్ పెట్టలనుకున్న నాగార్జున శ్రీరామ చంద్రా కెప్టెన్సీ బాగా చేస్తున్నాడంటూనే జెస్సీని వంట చేసుకోమనడం తప్పని క్లాస్ పీకారు అలాగే కాజల్ కు లోబో మిడిల్ ఫింగర్ కావాలని చూపించలేదని నమ్మిన నాగార్జున కాజల్ ను ఆ విషయం మర్చిపోమని చెప్పారు.ఇక షణ్ముఖ్,సిరికి కూడా ఈసారి సున్నితంగా క్లాస్ తీసుకున్న నాగార్జున కొండ పొలం మూవీ టీమ్ ను ఇంటి సభ్యులకు పరిచయం చేసి వారితో ఇంటి సభ్యులను కొన్ని ప్రశ్నలు అడిగించి వాటి సమాధానాలు తెలుసుకున్నారు.
ఇక రాజు బానిస టాస్క్ ను ఇంటి సభ్యులతో ఆడించిన నాగార్జున ఇంట్లో ఉన్న అపార్ధాలను దూరం చేయడానికి ప్రయత్నించారు.ఈ టాస్క్ లో హమీదాని మానస్, షణ్ముఖ్ స్లేవ్ గా ఎంచుకున్నారు దీంతో హమీదా తన కూల్ కోల్పోయి వారిద్దరితో వాగ్వాదానికి దిగింది.ఇక కాజల్ కి రాజు కిరీటం పెట్టిన శ్వేత ఇది నెగెటివ్ వేలో పెడుతున్నాను మీరు మ్యానిపులేట్ చేయాలని చూడడం నాకు నచ్చలేదు అంటూ తన అభిప్రాయాన్ని పంచుకుంది.ఇక సన్నిని కింగ్ లా చూడాలని ఉంది అంటూ మానస్,లోబో సన్నికి రాజు కిరీటాన్ని పెట్టారు.
పాపం పండగ రోజు కొందరిని సేవ్ చేసి మిగిలిన వారిని టెన్షన్ పెట్టడం ఎందుకు అనుకున్నారో ఏమో నాగార్జున గారు అందర్నీ రేపు సేవ్ చేస్తానని ఎపిసోడ్ ను ముగించారు.ఇక ఈరోజు ఎపిసోడ్ ముగిసిన తీరు చూస్తుంటే రేపు హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందనిపిస్తుంది.ఒకవేళ ఇదే కానీ జరిగితే సీజన్ 5లో ఇదే మొదటి డబుల్ ఎలిమినేషన్ కానున్నది.