కార్తీ హీరోగా మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం సర్దార్. శుక్రవారం ఈ మూవీ రిలీజ్అయ్యి మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. సర్దార్ కి పోటీగా మరో మూడు సినిమాలు వచ్చాయి. అయితే వాటిని తట్టుకొని ఈ మూవీ అత్యధిక కలెక్షన్స్ ని మొదటి రోజు సొంతం చేసుకుంది. తెలుగు సినిమాలైనా మంచు విష్ణు జిన్నా, ఓరి దేవుడా కంటే సర్దార్ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయంటే కార్తీకి తెలుగులో కూడా ఫాలోయింగ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. తమిళ్ లో ఏ రేంజ్ హిట్ అయ్యిందో అంతకు మించి తెలుగులో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.
రెండో రోజు కూడా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. కార్తీ కెరియర్ లో డ్యూయల్ రోల్ లో తండ్రి, కొడుకులుగా వచ్చిన చిత్రం కావడంతో పాటు స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీని దర్శకుడు మిత్రన్ ఆవిష్కరించాడు. ఇక సోషల్ ఎలిమెంట్ ని ఈ మూవీలో కమర్షియల్ యాంగిల్ లో ప్రెజెంట్ చేసి ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా చేసాడు. దీంతో సినిమాకి సాలిడ్ హిట్ టాక్ వచ్చింది.
ఇదిలా ఉంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఇప్పటికే అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. తెలుగు స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా ఓటీటీ ఛానల్ సొంతం చేసుకుందని టాక్. ఇక ఈ మూవీ హిట్ టాక్ రావడంతో డిజిటల్ లో స్ట్రీమింగ్ కావడానికి కచ్చితంగా నెల రోజుల పైనే పట్టే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం ఆహా టీమ్ భారీ మొత్తంలోనే నిర్మాతకి ఇచ్చినట్లు తెలుస్తుంది.