Sara Ali Khan : స్టార్ హీరో కూతురైనా తన సింప్లిసిటీతో చంపేస్తుంది బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీ ఖాన్. చురుకైన వ్యక్తిత్వంతో వినయపూర్వకంగా, డౌన్ టు ఎర్త్ ఉండే సారా అలీఖాన్‌కు సోషల్ మీడియాలో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. నటించింది కొన్ని సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ మ్యాటర్ సారాలో బోలెడంత ఉంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో చలాకిగా ఉంటుంది సారా. చాలా మంది సారాను సోషల్ స్టార్ అని పిలుస్తుంటారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో షూట్ పిక్స్‌ను, రీల్స్‌ను పోస్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫాలోవర్స్‌ను అలర్ట్‌గా ఉంచుతుంది సారా అలీఖాన్. ఫాలోవర్స్ కూడా ఆమె పోస్ట్‌ల కోసం ఎదురుచూస్తుంటారు. తాజాగా సింపుల్ అవుట్‌ఫిట్ ధరించి చేసిన ఫోటో షూట్ పిక్స్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది సారా అలీ ఖాన్ . ఆ పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Sara Ali Khan : తెల్లటి ట్యాంక్ టాప్ వేసుకుని దానికి జోడీగా డెనిమ్ ప్యాంట్ ధరించి పక్కింటి అమ్మాయిలా కనిపించి అందరిని అలరించింది సారా అలీఖాన్. ఓ అవుట్‌డోర్ ఫోటో షూట్ కోసం సారా కంఫర్టబుల్, మోడ్రన్ అవుట్‌ఫిట్‌ను ధరించి కుర్రాళ్లను మెస్మరైజ్ చేసింది. మోకాళ్ల దగ్గర ప్యాంట్‌కు వచ్చిన చిరుగుల్లు ఎంతో ట్రెండీగా కనిపించాయి.చింపిరి జుట్టు హైలెట్ గా నిలిచింది.

ఏ అమ్మాయికైనా అత్యంత ఖరీదైన ఆభరణం ఏదైనా ఉందా అంటే అది చిరునవ్వేనని అంటారు . అలాంటి చిరునవ్వుతోనే కెమెరాకు పోజులిచ్చింది సారా. తన క్యూట్ స్మైల్‌తో రోడ్డు మీద కూర్చుని డెనిమ్ జీన్స్‌తో చేసిన ఫోటో షూట్ ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

సింపుల్ డ్రెస్ తో స్టన్నింగ్‌గా కనిపించడం మాత్రమే కాదు రెడ్ కార్పెట్ లుక్స్‌తోనూ ఫిదా చేసే టాలెంట్ సారా అలీ ఖాన్ సొంతం. ఇంతకు ముందు ఓ అవార్డుల ఫంక్షన్ కోసం స్ట్రాప్‌లెస్ అవుట్‌ఫిట్‌ను వేసుకుని కుర్రాళ్లకు చెమటలు పట్టించింది సారా. రెడ్ కార్పెట్‌పైన మిరిమిట్లు గొలిపే గౌన్‌లో క్లీవేజ్ షో చేసి కుర్రాళ్లను కన్‌ఫ్యూజ్ చేసింది. ఈ ఎల్లో కలర్ మిని డ్రెస్‌లో అందాలను ఆరబోసి అదరగొట్టింది సారా అలీ ఖాన్. రెడ్‌కార్పెట్‌పైన సారాకు స్పెషల్ లుక్ అందించింది ఈ అవుట్‌ఫిట్ ధర లక్షరాల 80 వేల రూపాయలు.

మోడ్రన్ దుస్తుల్లో మతులుపొగొట్టడమే కాదు సంప్రదాయ కట్టులోనూ అందరి చూపును తనవైపు తిప్పుకోగలదు సారా. ఓ ఫ్యాషన్ ఫోటో షూట్ కోసం గులాబీ రంగు లెహంగా వేసుకుని సారా అలీ ఖాన్ పెళ్లి కూతురిలా ముస్తాబై అదరగొట్టింది. కాబోయే వధువులకు ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చింది. సారా కత్తిలా కనిపించిన ఈ లెహంగా ధర లక్ష రూపాయలు.
