భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ కోసం తాజాగా బిసిసిఐ భారత్ జట్టును ప్రకటించింది.ఈ జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహిస్తుండగా,కే.ఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు.ఈ టీమ్ లో వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్స్ గా బిసిసిఐ రిషబ్ పంత్,ఇషాన్ కిషన్ కు ఛాన్స్ ఇచ్చింది.దీంతో సంజు శాంసన్ కు టీమ్ లో చోటు దక్కలేదు.దానిపై తాజాగా స్పందించిన సంజు శాంసన్ ట్విట్టర్ వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
తాను అద్భుతమైన కీపరే కాదు అద్భుతమైన ఫీల్డర్ కూడా అని అర్థమయ్యే విధంగా బౌండరీల వద్ద క్యాచ్ లు పడుతున్న పిక్స్ ను షేర్ చేశాడు.ఈ పోస్ట్ ను చూసిన సోషల్ మీడియా యూజర్స్ సంజుకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు.